Sena On Anna Hazare Scrapping Fast Over Farm Laws అన్నా హజారేపై విమర్శలు గుప్పించిన ‘సేన’

Don t know his stand sena on anna hazare scrapping fast over farm laws

Anna Hazare cancells Indefinite fast, Anna Hazare Devendra Fadnavis, Anna Hazare Social Activists, Anna Hazare Indefinite Hunger Strike, Anna Hazare new agriculture laws, Devendra Fadnavis meets Anna Hazare, Anna Hazare cancels fast, Anna Hazare, Social Activists, Indefinite Hunger Strike, new agriculture laws, Devendra Fadnavis, Maharashtra, National, Politics

Social activist Anna Hazare - who yesterday cancelled his hunger strike in support of farmers protesting the agriculture laws, after meeting senior BJP leader Devendra Fadnavis - must clarify his position on this issue, Maharashtra's ruling Shiv Sena said Saturday in party mouthpiece "Saamna"

అన్నాహజారే.. మీరు రైతుల పక్షమేనా.? ప్రశ్నించిన సామ్నా

Posted: 01/30/2021 02:43 PM IST
Don t know his stand sena on anna hazare scrapping fast over farm laws

ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అన్నా హజారే చేపట్టనున్నట్లు ప్రకటించిన నిరవధిక నిరాహార దీక్షకు రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఎవరి పక్షాన నిలబడ్డారన్న విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం వుందని శివసేన ప్రశ్నించింది. ఈ మేరకు మహారాష్ట్ర అధికారపక్షం శివసేన సామ్నా పత్రికలో సంపాదకీయాన్ని ప్రచురించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నావిస్ ను కలువక ముందు కలిసిన తరువాత ఆయనలో వచ్చిన మార్పులపై సామ్నా ప్రశ్నలు కురిపించింది.

రైతు సమస్యలపై కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై అన్నా హాజారే తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని తీసుకున్న నిర్ణయం సీనియర్ బీజేపి నేతను కలిసినంతనే ఎంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని.. ధీంతో ఆయన రైతు పక్షపాతగా వున్నారా..? లేక ఎవరి పక్షంగానైనా మారారా.? అన్న విషయాన్ని తాము చెప్పలేకపోతున్నామని అన్నారు, ఈ సందర్భంగా రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని అరోపించింది. రైతులను అంతర్జాతీయ నేరగాళ్లుగా పరిగణించిన కేంద్రం వారిని బెదిరింపులకు గురిచేస్తోందని అరోపించింది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలుగా పోరాడుతున్న రైతన్నలకు అండగా స్వతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త అన్నా హాజారే లాంటి పెద్దలు వారికి మద్దతుగా నిలిస్తే వారికి కొండంత ధైర్యం లభించేదని అన్నారు. హాజారే నిరవధిక నిరాహార దీక్షకు పూనుకునివుంటే అది రైతులకు అదనపు బలం కావడంతో పాటు కేంద్రంపై ఒత్తడిని కూడా తీసుకువచ్చేదని సామ్నా తన సంపాదకీయంలో పేర్కోంది. నిజానికి అన్నాహజారే నూతన సాగు బిల్లులపై ఏమనుకుంటున్నారా.? అన్నా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నవారి పక్షాన నిలుస్తున్నారా.? లేక దాని నుంచి దృష్టి మళ్లించే వ్యక్తుల పక్షాన నిలుస్తున్నారా.? ఈ విషయం కనీసం మహారాష్ట్ర రైతాంగానికైనా తెలియాల్సిన అవసరముందని సామ్నా ప్రశ్నించింది,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles