thousands from UP, Haryana to join farmers' protest రైతు నిరసనలు: హర్యానా, ఘాజీపూర్ లలో ఇంటర్నెట్ సేవలు బంద్

Internet suspended at ghazipur border as thousands from up march towards protest site

farmers protest, protest delhi, farmers laws farm, republic day farmers, farmers tractor rally, farmers rally violent, farmers red fort, farmers farm laws, delhi police, Intelligence bureau, farmers turn violent, farmers rally deviated, farmers ram leela maidan, supreme court committee, delhi, politics

As the crowd started to swell at Ghazipur border (Delhi-UP) acting as a catalyst for the resumption of the farmers' protest following the Republic Day violence that started to fade out the stir, the authorities suspended internet services at the protest site and its surrounding areas. Thousands of farmers have been camping at Ghazipur border which connects Uttar Pradesh and Delhi to protest against the Centre's farm laws.

హర్యానా, యూపీల నుంచి వేలాదిగా కదులుతున్న రైతులు

Posted: 01/30/2021 12:01 PM IST
Internet suspended at ghazipur border as thousands from up march towards protest site

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుమారు మూడు నెలలుగా దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాలలో పెద్దస్థాయిలో మోహరించి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కాగా గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన పరిణామాలు ఓ వైపు రైతులను బాధిస్తున్న తరుణంలోనే సింఘు, టెక్రీ, ఘాజీపూర్ ప్రాంతాలకు చెందిన స్థానికులుగా చెప్పుకుంటున్న పలువురు రైతులను అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా డిమాండ్ చేయడం.. అంతేకాక వారి గూడారాలను తొలగించడం.. వారిపై రాళ్లు రువ్వి దాడులు చేశారు.

స్థానికులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో గుమ్మిగూడి రైతులపై తిరగబడి అక్కడి నంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో దేశ రాజధాని సరిహద్దుల్లో క్రితంరోజు సాయంత్రం ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం అలుముకుంది. తమపై రాళ్ల రువ్విన వారిపై రైతులు కూడా ప్రతిగా తిరిగబడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే స్థానికులుగా పేర్కోంటూ వచ్చిన వారిపై పోలీసులు లాఠీ చార్జీలు చేశారు. ఈ క్రమంలో రైతులను కూడా పోలీసులు చెదరగొట్టాల్సి వచ్చింది. మరోవైపు కేంద్రం నుంచి కూడా రైతులకు సహాయ నిరాకరణ జరగుతోంది. వారికి అందే కనీస సౌకర్యాలను అందకుండా చేస్తూ.. వారు నిరసనలను వదిలేసి వెళ్లేలా ఒత్తిడి తీసుకువస్తోంది.   

రైతులను అటు కేంద్రం ఇటు స్థానికులు టార్గెట్ చేశారని వారిని దీక్షాస్థలి వదిలి వెళ్లేలా చేస్తున్నారని తెలుసుకున్న పరిసర రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాకలు చేరుకుంటున్నారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైన రైతులు ఆరు నెలలకు కావాల్సిన అహార పదార్థాలతో నిరసన ప్రాంతాలకు తరలివస్తున్నారు. దీంతో సింఘు సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హస్తినలో గత మూడేళ్లుగా తిష్టవేసి నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావంగా కదిలివస్తున్న వేలాది మంది రైతన్నలను అదుపు చేయడం పోలీసులకు శిరోభారంగా మారింది.

దీంతో దేశరాజధానికి చేరుకుంటున్న రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ క్రమంలోనే రైతులకు రైతులు మాత్రమే మిత్రులని.. చాటేలా ఉత్తర్ ప్రదేశ్ నుంచి వెలాది మంది రైతులు ఘాజీపూర్ చేరుకుని దీక్షకు దిగిన రైతులకు మద్దతు ప్రకటించారు. కాగా దేశరాజధాని ఢిల్లీని, ఉత్తర్ ప్రదేశ్ ను కలిపే ఘాజీపూర్ సరిహద్దుల్లో అక్కడి ప్రభుత్వాలు ఇంటెర్నెట్ సేవలను రద్దు చేశాయి. రైతులకు మద్దతుగా ముజాఫర్ నగర్ నుంచి కూడా వేలాది మంది రైతులు దీక్షాస్థలికి చేరుకోనున్నారని సమాచారం,

ముజాఫర్ నగర్ లో వేలాది మంది రైతులు కిసాన్ మహాపంచాయత్ పేరిట గుమ్మిగూడి సమావేశాలు నిర్వహించుకున్నారు. వారంతా రైతులకు మద్దుతు ప్రకటించారు. భారత కిసాన్ యూనియన్ నేతృత్వంలో సమావేశమైన రైతులు ఢిల్లీ చేరుకుని రైతులకు సంఘీబావంగా ఘాజీపూర్ చేరుకుని దీక్షా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలోనే హస్తినకు చేరుకునేందుకు హర్యానా రైతులు కూడా సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 14 జిల్లాల్లో అంతర్జాల సేవలను ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో లేకుండా చేసింది అక్కడి బీజేపి ప్రభుత్వం.

దీంతో హర్యానా రాష్ట్రంలో మొత్తంగా 17 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం ఏర్పడింది. హర్యానాలోని అంబాటా యుమునానగర్, కురుక్షేత్ర, కర్నాల్, ఖైతాల్, పానిపట్, హిస్సార్, జింద్, రోహ్ తక్, భివాణీ, ఛక్రీ దాద్రీ, ఫతేహ్ బాద్, రివారీ, సిర్సా జిల్లాలో అంతర్జాల సేవలకు రైతుల ఉద్యమం నేపథ్యంలో నిలిపివేయబడ్డాయి. ఇదిలావుండగా, జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నేడు సద్భావన దినం పాటించాలని రైతులు నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులు ఉపవాస దీక్షచేపట్టనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles