Social Activist Anna Hazare Cancels Fast రైతు సమస్యలపై అన్నా హజారే వెనక్కు..నిరవధికదీక్ష రద్దు

Social activist anna hazare cancels fast backs farm reforms

Anna Hazare cancells Indefinite fast, Anna Hazare Devendra Fadnavis, Anna Hazare Social Activists, Anna Hazare Indefinite Hunger Strike, Anna Hazare new agriculture laws, Devendra Fadnavis meets Anna Hazare, Anna Hazare cancels fast, Anna Hazare, Social Activists, Indefinite Hunger Strike, new agriculture laws, Devendra Fadnavis, Maharashtra, National, Politics

Veteran social activist Anna Hazare has cancelled his planned fast against the three central agricultural laws. He announced his decision today in the presence of senior BJP leader and former Maharashtra chief minister, Devendra Fadnavis.

రైతు సమస్యలపై అన్నా హజారే వెనక్కు..నిరవధికదీక్ష రద్దు

Posted: 01/29/2021 07:26 PM IST
Social activist anna hazare cancels fast backs farm reforms

ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అన్నా హజారే చేపట్టనున్నట్లు ప్రకటించిన నిరవధిక నిరాహార దీక్షకు రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా ప్రకటించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు, రైతు సమస్యలపై పరిష్కారం కోరుతూ ఆయన నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఇవాళ ఉదయం ప్రకటించిన విషయం విధితమే. తన సొంత పట్టణమైన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్దిలో ఈ నెల 30 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఇవాళ ఉదయం ఆయన ప్రకటించారు.

కాగా, ఇవాళ సాయంత్రం ఆయన తన ఆమరణ నిరాహార దీక్షను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నావిస్ సమక్షంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. అన్నా హాజరే నిరవధిక నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆఘమేఘాల మీద దేవేంద్ర ఫడ్నావిస్ వచ్చి ఆయను కలిసి చర్చించిన తరువాత ఆయన సమక్షంలోనే సామాజిక కార్యకర్త తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సుదీర్ఘకాలంగా రైతుల పక్షాన అందోళనను చేస్తున్నానని అన్నారు, వారి సమస్యలపై కూడా పోరాటం చేస్తున్నానని అన్నారు.

శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేయడం నేరం కాదన్న ఆయన.. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలియజేసే హక్కు దేశపౌరులకు వుందని అన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆంధోళనను చేస్తున్నారని అన్నారు. రైతేల మరణాలను తాను మూడేళ్లుగా ప్రస్తావిస్తున్నానని, వారి ఆత్మహత్యలను తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని అవేదన వ్యక్తం చేశారు. అందుకు గిట్టుబాటు ధర లభించకపోవడమే కారణమని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలను యాభై శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు తన వద్ద లేఖ వుందని అన్న అన్నాహాజరే ఈ క్రమంలోనే తాను రేపట్నించి చేపట్టనున్న దీక్షను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు

అయితే ఇవాళ ఉదయం ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వం వినడం లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యల పరిష్కారానికి సంబంధించిన తమ డిమాండ్లను మరోసారి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని చెప్పారు. ప్రధాని మోదీకి, కేంద్ర వ్యవసాయ మంత్రికి తాను ఎన్ని లేఖలు రాసిన ప్రయోజనం లేకపోయిందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో ఢిల్లీలో తాను ఢిల్లీలో దీక్షకు పూనుకుంటాననగా.. సమస్యలను పరిష్కరిస్తామన్న కేంద్రం..  ఇంత వరకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles