Blast reported near Israel embassy in Delhi ఢిల్లీలో ఉద్రిక్తత.. ఇజ్రాయిల్ రాయబారి కార్యాలయం వద్ద బాంబు పేలుడు

Blast reported near israel embassy in delhi car windscreens damaged

Blast reported near Israel embassy in Delhi, Blast reported in Delhi, Blast reported near Israel embassy, bomb blast in Delhi,bomb blast, Isreal embassy, Delhi, Dr. ABJ Abdul kalam Road, Delhi police, Delhi deputy commissioner, Pramod Kushwah, Crime

A low-intensity explosion was reported few metres away from the embassy of Israel in Delhi on Friday, police said. The blast took place at Dr APJ Abdul Kalam Road near the Israel embassy, officials of Delhi Police confirmed.

ఢిల్లీలో ఉద్రిక్తత.. ఇజ్రాయిల్ రాయబారి కార్యాలయం వద్ద బాంబు పేలుడు

Posted: 01/29/2021 06:45 PM IST
Blast reported near israel embassy in delhi car windscreens damaged

దేశరాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు సంభవించింది. అత్యంత కట్టదిట్టమైన భద్రత వుండే విదేశీ రాయబార కార్యాలయాలు వుండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఇవాళ సాయంత్రం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి కొద్ది మీటర్ల దూరంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. అయితే స్వల్ప తీవ్రత కలిగిన బాంబు పేలుడు సంభవించడంతో స్థానికంగా ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినా సమీపంలోని మూడు కార్ల కిటికీ అద్దాలు మాత్రం విస్పోటనం ధాటికి బద్దలయ్యాయని పోలీసులు తెలిపారు.

ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఉన్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం రోడ్ వద్ద ఈ పేలుడు జరిగిందని ఢిల్లీ పోలీసు అధికారులు ధృవీకరించారు. ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు ఈ పేలుడులో ప్రజలకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. కాగా బాంబును ఇక్కడ అమర్చిన వారెవరు అన్న విషయమై.. డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం రోడ్ లోని సిసిటివి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పేలుడు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలానికి చేరుకుని నమానాలను సేకరిస్తున్నారు.

బాంబు పేలుడు ఘటనపై స్థానికులు పోలీసు కంట్రోల్ రూమ్ తో పాటు పోలీసు ఉన్నాతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఢిల్లీ ఢిప్యూటీ పోలిస్ కమీషనర్ ప్రమోద్ కుష్వా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఈ ఘటన ఎలా చోటుచేసుకుంది, ఇందుకు కారణాలు ఏంటి.. దీనిని ఎవరు అమర్చారు.. ఈ ఘటనకు కారకులు ఎవరు అన్న వివరాలను ఇప్పడే చెప్పలేమని పోలీసు అధికారులు తెలిపారు, అయితే ఎనమిదేళ్ల కాలంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండవ సారి. 2012 ఫిబ్రవరి 13న ఇజ్రాయెల్ దౌత్యవేత్త తాల్ యెహోషువా కోరెన్ కారులో బాంబును అమర్చారు. ఆ పేలుడులో ఆమెకు గాయాలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles