BJP MLA Raja Singh convicted in Beef festival case రాజాసింగ్ కు ఏడాది జైలుశిక్ష విధించిన కోర్టు

Bjp mla raja singh sentenced to one year imprisonment

BJP MLA Raja Singh sentenced, BJP MLA Raja Singh sentenced Beef Festival case, BJP MLA Raja Singh sentenced for one year imprisonment, BJP MLA GoshaMahal Raja singh, BJP MLA Raja Singh beef festival, BJP MLA Raja Singh osmania university, BJP MLA Raja Singh Bollaram police station, BJP MLA, Goshamahal, Raja Singh, convicted, controversial statements, Beef festival, Nampally Court, Crime

The Nampally court on Friday convicted the Goshamahal MLA Raja Singh for making controversial statements. The apex court sentenced him for one year imprisonment for calling BJP leaders to stage protest against organising Beef festival at Osmania University on 10 December 2015.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలుశిక్ష విధించిన కోర్టు

Posted: 01/29/2021 08:40 PM IST
Bjp mla raja singh sentenced to one year imprisonment

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఏడాది జైలుశిక్ష విధించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసును విచారించిన న్యాయస్థానం ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చింది. దీంతో ఇవాళ తీర్పును వెలువరించిన న్యాయస్థానం ఆయనకు ఏడాది కాలం పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, ఆయన తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. ఈ కేసులో హైకోర్టుకు వెళ్లేందుకు నెల రోజు వ్యవధిని కూడా కేటాయించింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2015 లో అక్కడి విద్యార్థి సంఘం బీఫ్ ఫెస్టివల్ (పెద్ద కూర పండుగ) ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ బీఫ్ పెస్టివల్ సందర్భంగా రాజా సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై  కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు విచారణ సాగగా, ఇవాళ నాంపల్లి కోర్టు రాజా సింగ్ కు జైలు శిక్ష విధించింది. అనంతరం ఆయన బెయిల్ కు దరఖాస్తు చేయగా, న్యాయస్థానం అందుకు సమ్మతిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తానని రాజా సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.

2015లో ఉస్మానియా వర్సిటీలో ఓ విద్యార్థి వర్గం బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారన్న వార్తలతో రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే తన విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు. దాద్రీ తరహా ఘటనలు పునరావృతం అవుతాయని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలతో రాద్ధాంతం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై సెక్షన్ 295-ఏ కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసులోనే ఆయనకు ఏడాది జైలు శిక్ష పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MLA  Goshamahal  Raja Singh  convicted  controversial statements  Beef festival  Nampally Court  Crime  

Other Articles