Cops crack death of 9 migrants in Warangal స్లీపింగ్ పిల్సే వరంగల్ హత్యలకు వాడిన ఆయుధం..

24 year old guest worker from bihar held for warangal killings

migrant worker, warangal family murder solved, warangal nine murders, Sanjay Kumar Yadav, murder to hide truth, migrant worker killings, Warangal killings, CCTV footage, Telangana, Crime

Telangana police claimed to have cracked the mystery behind the death of nine migrant workers, including six of the same family, whose bodies were retrieved from an abandoned well on the outskirts of Warangal town last week.

తల్లితో సహజీవనం.. తనయతో సన్నిహిత్యం.. దశ హత:..

Posted: 05/25/2020 05:47 PM IST
24 year old guest worker from bihar held for warangal killings

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటనను వరంగల్‌ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒక హత్యను కప్పిపుచ్చడానికి నిందితుడు మరో తొమ్మిది హత్యలు చేశాడని చెప్పారు. ఈ ఘోరానికి బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ (24) అనే వలస కార్మికుడు కారణమని పోలీసులు తెలిపారు. ఒక మహిళతో ఏర్పర్చుకున్న అక్రమ సంబంధంతో పాటు అమె కూతురితో కూడా సన్నిహిత్యంగా మెలగడం.. ఈ ఘటనకు దారితీసిందని వరంగల్ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ తెలిపారు.

గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్‌, అతడి భార్య పనిచేసస్తుండేవారని, అదే కేంద్రానికి బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికుడు సంజయ్ కుమార్‌ యాదవ్ కూడా రావడంతో అక్కడ వారితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఇక మక్సూద్ కుటుంబంతో దగ్గరగా మెలిగిన సంజీవ్.. మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురు రఫీకా (31) భర్తతో వేరుపడి ముగ్గురు పిల్లలతో కలసి వేరుగా ఉంటుందని తెలుసుకుని ఆమెకు దగ్గరయ్యాడని చెప్పారు. గీసుకొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడన్నారు.

ఈ క్రమంలో తన కూతురితో కూడా సంజయ్ చనువుగా ఉండడాన్ని రఫీకా నిలదీయడం.. అక్కడితో ఆగకుండా తనను పెళ్లి చేసుకోవాలని గొడవ పడింది. లేని పక్షంలో తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పెళ్లికి తమ పెద్దల అనుమతి కోసం ఊరెళ్తున్నామని చెప్పిన సంజయ్.. విశాఖకు వెళ్లే గరీభ్ రథ్ రైలులో తీసుకెళ్లాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని అందులో నిద్రమాత్రలు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో నిడుదవోలు వద్ద రైల్లోంచి తోసేసి.. ఏమీ ఎరుగనట్టు తిరిగి గీసుకొండ చేరుకున్నాడు.

న అక్క కూతురు గురించి మక్సూద్‌ భార్య నిషా సంజయ్ ను నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో తన హత్య ఎక్కడ భయటపడుతోందననని.. మక్సూద్‌ కుటుంబసభ్యులందరినీ చంపాలని నిర్ణయించుకున్న సంజయ్.. మక్సూద్ అబ్బాయి పుట్టినరోజును ఎంచుకున్నాడు. అనుకూలంగా ఉన్న సమయంలో అక్కడి భోజన పధార్థాలలో నిద్రమాత్రలు కలిపాడు. ఇది తిన్నవారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న వారందరినీ గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడని కమీషనర్ తెలిపారు. పదిమందిని హత్య చేయడానికి సంజయ్ వాడిన అయుధం స్లీపింగ్ పిల్స్ కావడం గమనార్హం. ఈ కేసులో సిసిటీవీ ఫూటేజీ కీలకంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh