Is this not insulting srivari devotees: janasena వడ్డీకాసులవాడికి ఇచ్చిన కానుకలు నిరర్థకమా.?: పవన్ కల్యాణ్

Selling ttd properties an insult to devotees pawan kalyan

Jana Sena, JSP president, Pawan Kalyan, ttd, tirumala, tirupati, ttd online, tirumala temple, ttd properties auction, AP government, illegal sand activities, YSRCP, TTD properties, TTD Properties sale, devotees, Pawan Kalyan news, TTD News, andhra pradesh, Politics

erming the donated lands and other properties to Lord Sri Venkateswara of Tirumala Tirupati Devastanams as substandard was nothing but an insult to the devotees, stated the Jana Sena president Pawan Kalyan in a press release

వడ్డీకాసులవాడికి ఇచ్చిన కానుకలు నిరర్థకమా.?: పవన్ కల్యాణ్

Posted: 05/25/2020 06:43 PM IST
Selling ttd properties an insult to devotees pawan kalyan

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు సమర్పించిన ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ కమిటీ నిర్ణయం తీసుకోవడం పెను వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయమై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యణ్ కూడా తీవ్రంగా స్పందించారు. భక్తులు తమ ధైవానికి ఇచ్చిన ఆస్తులను కమిటీ నిరర్థకమని అనడం దాతలను, భక్తులను అవమానించడమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆస్తులను ధర్మ ప్రచారానికి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించాలే తప్ప.. విక్రయించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

తిరుమల దేవదేవుడికి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం చిన్నపాటి ఇంటి స్థలాలను, తక్కువ విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములు, భవనాలను విరాళంగా ఇచ్చారని పవన్‌ అన్నారు. భక్తులు శ్రీనివాసుడిపై భక్తితో ఇచ్చిన కానుకలను.. చిన్నవిగా చూడడం, నిరర్థకం అని ముద్రవేయడం.. శ్రీవారి భక్తులతో పాటు శ్రీవారిని కూడా అవమానించడమేనని పవన్‌ అన్నారు. అస్తుల వేలం వైపు తితిదే ఎందుకు యోచిస్తోందోనన్నదే పెద్ద ప్రశ్నగా మారిందని పవన్‌ అన్నారు. తితిదేకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాలో కూడా  స్వామివారికి ఆస్తులున్నాయని, వాటిని కాపాడుకునే ప్రయత్నాలు చేయాలని సూచించారు.

ప్రభుత్వానికి, టీటీడీకీ పవన్ కల్యాణ్ సూటి ప్రశ్నలు:

1) టీటీడీకి ఈ భూములను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?

2) ఉన్న భూములను లీజుకు ఇవ్వడం ద్వారా కానీ లేదా వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగించే విధంగాకానీ అభివృద్ధి చేసి యాజమాన్య హక్కులు పోగొట్టుకోకుండా ఆదాయవనరులు పొందేందుకు టి.టి.డి. ఎందుకు ప్రయత్నం చేయలేకపోతోంది?

3) ఈ భూముల అమ్మకాల ద్వారా టి.టి.డి. ఏ మేరకు లబ్ది పొందబోతోంది? దీనికి సంబంధించి ఏమైన సరైన వివరణలు ఇచ్చారా?

4) ఈ భూములను అమ్మడం ద్వారా టి.టి.డి. తన ధార్మిక లక్ష్యాలకు, విలువలకు చేరువ కాగలుగుతుందా?

5) కోట్లాదిమంది భక్తుల ద్వారా, ప్రజల ద్వారా టి.టి.డి.కి భారీగా విరాళాలు అందుతున్నాయి. టి.టి.డి. తమ భూములను ఎందుకు అమ్మి వేస్తోందో తెలుసుకొనే హక్కు వారికి లేదా?

6) గతంలో టి.టి.డి. తమ భూముల అమ్మకాల కోసం గౌరవ రాష్ట్ర హైకోర్టు నుంచి అనుమతులు పొందిన సందర్బాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా భూముల అమ్మకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు నుంచి అనుమతులు పొందాలని టి.టి.డి.ని ఆదేశించగలదా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles