AP police constables held for carrying telangana liquor కటకటాల్లోకి.. ఈజీ మనీకోసం వెంపర్లాడిన కానిస్టేబుళ్లు..

Andhra pradesh police constables held for carrying telangana liquor

ap police, police constables liquor, ap liquor, Telangana Liquor, liquor rates in AP, Liquor rates in Telangana, GPR Police constable siva ramakrishna, Ibrahimpatnam Police station, Nageswara rao, Telangana, Andhra Pradesh, Crime

In two different incidents two constables working in Andhra Pradesh state held for transporting telangana liquor in to the state and make money.

కటకటాల్లోకి.. ఈజీ మనీకోసం వెంపర్లాడిన కానిస్టేబుళ్లు..

Posted: 05/25/2020 02:46 PM IST
Andhra pradesh police constables held for carrying telangana liquor

వాళ్లు పోలీసులు. ఆ విషయం వారికి కూడా తెలుసు. అయినా అడ్డదారిలో ఈజీగా మనీ సంపాదించాలని ఆశపడ్డారు. అంతే.. అడ్డంగా బుకై కటకటాల పాలయ్యారు. దోరల్లా హ్యాపీగా జీవించాల్సిన వాళ్లు.. దొంగల్లా ఏడు ఊచలు లెక్కపెట్టడానికి గల వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. తెలుగు రాష్ట్రం రెండుగా విభజించిన తరువాత ఇప్పటి వరకు తలెత్తని సమస్య వైఎస్ జగన్ ఎన్నికల హామీని నిలబెట్టుకునే క్రమంలో తలెత్తింది. అదే అంచెల వారీగా సంపూర్ణ మధ్య నిషేధం. సమయం సందర్భం కలసివచ్చిందో ఏమో కానీ.. ఏకంగా కరోనా లాక్ డౌన్ కన్నా ముందుగానే స్థానిక సంస్థలు, మున్సిఫల్ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి.

అదే సమయంలో రాష్ట్రంలో ఏకంగా 50 రోజుల తరువాత మే 4వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. అయితే మద్యం ధరలను తొలుతు 25శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార ప్రభుత్వంపై పలు విమర్శలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ తరువాతి రోజునే చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోమారు యాభై శాతం మేర ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతే మద్యం ధరలు సామాన్యులకు అందకుండా పోయాయి. అంతేకాదు ఇలా పేదలకు, బీదలకు మద్యం అందని ద్రాక్షాగా చేయాలని.. ఆ తరువాత వారే మద్యానికి దూరమవుతారన్నది ప్రభుత్వ యోచన.

దీనిని ఆసరగా చేసుకుని తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం తరలించి.. తక్కువ ధరకు విక్రయించి సోమ్ముచేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. వీరిని పట్టుకుని అరెస్టు చేయాల్సిన పోలీసులు.. ఈ విషయం తెలిసి.. అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా బక్కయ్యారు. వారి నుంచి 400 క్వార్టర్ బాటిళ్లు, 20 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. విజయవాడలోని జీఆర్పీలో డిప్యూటేషన్‌లో పనిచేస్తున్న శివరామకృష్ణ, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు అని పోలీసులు తెలిపారు. ఏపీలో మద్యం ధరలు పెరగడంతో పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles