AP HC revokes suspension of Addl DGP ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు..

Andhra high court sets aside suspension of senior ips officer ab venkateswara rao

AP High Court, AB Venkateswara Rao, former intelligence chief, Central Administrative Tribunal, senior IPS officer, Andhra Pradesh

The Andhra Pradesh High Court has set aside the suspension of senior IPS officer and former intelligence chief AB Venkateswara Rao and directed the state government to reinstate him to the regular service.

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు

Posted: 05/22/2020 06:59 PM IST
Andhra high court sets aside suspension of senior ips officer ab venkateswara rao

ఆంధ్ర్రపదేశ్ రాష్ట్ర  ప్రభుత్వానికి ఇవాళ హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఇవాళ ఉదయమే ప్రభుత్వ కార్యాలయాలకు, భవనాలకు, పంచాయితీ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేస్తూ విడుదల చేసిన జీవోను రద్దు చేసిన రాష్టోన్నత న్యాయస్థానం ఆ తరువాత కొద్దిసేపటికే డాక్టర్ సుధాకర్ కేసును సీబిఐకి అప్పగించి దర్యాప్తు చేయాలని అదేశించింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు చెందిన మూడో కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.

కొన్నినెలల కిందట మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై అప్పట్లో ఆయన క్యాట్ ను ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.... ఆ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై సస్పెన్షన్ చెల్లదని స్పష్టం చేసింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, సస్పెన్షన్ కాలంలో ఆపివేసిన వేతనాన్ని, ఇతర భత్యాలను కూడా చెల్లించాలని పేర్కొంది.

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు గతంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు భావించిన వైసీపీ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఏబీ తనపై సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సెంట్రల్ అడ్మిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్)కు వెళ్లగా, అక్కడ ఆయనకు నిరాశ తప్పలేదు. ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని క్యాట్ కూడా సమర్థించింది. దీంతో ఆయన రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆయన సస్పెన్షన్ ను రద్దు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles