RBI rate cut reduces EMI For home loans బ్యాంకు రుణాలదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న నెలసరి వాయిదాలు..

Repo rate cut to bring down emis for those on external benchmark

India Lockdown, Coronavirus Pandemic, repo rate cut, Reserve Bank of India, latest repo rates, reverse repo rate, Home loans, vehicle loans, persinal loans, Indian Economy

With the Reserve Bank of India (RBI) cutting the repo rates by 40 basis points (bps) to 4%, the interest rates on home loans may come down for existing as well as new borrowers whose loans are linked to an external benchmark. But a cut in policy rates will also mean reduction in the interest rate on fixed deposits.

బ్యాంకు రుణాలదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న నెలసరి వాయిదాలు..

Posted: 05/22/2020 07:53 PM IST
Repo rate cut to bring down emis for those on external benchmark

బ్యాంకులో లోన్లు తీసుకున్నవారికి, కొత్తగా రుణాలు తీసుకోవాలనుకుంటున్న వారికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. రెపో రేట్‌ను భారీగా తగ్గించింది. రెపో రేట్‌ను ఏకంగా 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో రెపోరేట్ 4.4 శాతం నుంచి 4 శాతానికి దిగి వచ్చింది. గత నెలలో ఆర్బీఐ రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. ఆర్‌బీఐ రెపో రేట్‌ను తగ్గించడంతో సామాన్యులకు రుణ భారం భారీగా తగ్గనుంది. మరోవైపు రివర్స్ రెపో రేట్‌ను భారతీయ రిజ్వరు బ్యాంకు 3.35 శాతానికి తగ్గించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది ఏడోసారి. ఏడుసార్లు మొత్తం కలిపితే 250 బేసిస్ పాయింట్స్ తగ్గింది. అంటే వడ్డీ 2.50 శాతం తగ్గినట్టే. ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గిచండంతో వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గనున్నాయి. హోమ్ లోన్, వెహికిల్ లోన్ భారం సామాన్యులపై భారీగా తగ్గనుంది. కొత్తగా ఇళ్లు, వాహనాలు కొనేవాళ్లను కొత్త వడ్డీ రేట్లు ఆకర్షించే అవకాశముంది. ఆర్బీఐ రెపో రేట్ తగ్గిచండంతో వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గనున్నాయి. హోమ్ లోన్, వెహికిల్ లోన్ భారం సామాన్యులపై భారీగా తగ్గనుంది. కొత్తగా ఇళ్లు, వాహనాలు కొనేవాళ్లను కొత్త వడ్డీ రేట్లు ఆకర్షించే అవకాశముంది.

అదెలా అంటే.. బ్యాంకుల దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వసూలు చేసే వడ్డీనే రెపో రేట్ అంటారు. అంటే ప్రజలకు అప్పులు ఇచ్చే బ్యాంకులు స్వల్పకాలం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు తీసుకుంటాయి. అందుకు బదులుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ని ఆర్బీఐకి ఇస్తారు. తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లిస్తాయి. ఆ అప్పులపై నిర్ణయించే వడ్డీనే రెపో రేట్ అంటారు. రెపో రేట్ తగ్గితే ఆర్బీఐ దగ్గర బ్యాంకులు ఎక్కువగా అప్పులు చేస్తాయి. వాటిని ప్రజలకు రుణాలుగా ఇస్తాయి. ఎలాగూ ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది కాబట్టి బ్యాంకులు కూడా సామాన్యులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. అలా రెపో రేట్లు తగ్గితే సామాన్యులకు లాభమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles