AP High Court transfers CBI to Probe Dr Sudhakar's case డాక్టర్ సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు హైకోర్టు అదేశం

Cbi to probe dr sudhakar s case visakhapatnam police to face the music

High Court, Doctor Sudhakar. Visakhapatnam doctor, CM YS Jagan, Visakha Police, Conspiracy, AP Police, CBI Probe, Central Bureau of Investigation, Andhra Pradesh, Politics

The Andhra Pradesh High Court has issued sensational orders over Visakhapatnam doctor Sudhakar's arrest. The court has asked CBI court to file a case against the Visakha police and made it clear in its directives that the matter be completed within 8 weeks and a report shall be submitted.

డాక్టర్ సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు హైకోర్టు అదేశం

Posted: 05/22/2020 01:37 PM IST
Cbi to probe dr sudhakar s case visakhapatnam police to face the music

డాక్టర్‌ సుధాకర్‌ అరెస్టు వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ సుధకార్ కేసులో నిజానిజాలు వెలుగు చూడాలంటే కేసు ధర్యాప్తును రాష్ట్ర పోలీసుల దర్యాప్తు చేయరాదని, కేసును సీబిఐకి అప్పగించింది. డాక్టర్ సుధకార్ కేసు వ్యవహరాంలో సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేసి నిర్ణీత గడువులోపు కేసు దర్యాప్తు చేయాలని.. సీబీఐని ఆదేశించింది. ఈ కేసు వ్యవహారంలో 8 వారాల్లో న్యాయస్థానానికి నివేదిక అందజేయాలని సీబీఐకి న్యాయస్థానం నిర్దేశించింది.

డాక్టర్ సుధాకర్‌ ఘటన కేసు వ్యవహరాన్ని హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం పట్ల ఆయన తల్లి సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడికి న్యాయం జరగాలనే తాము కోరుకుంటున్నామని అన్నారు. తన కొడుకు పరువు కాపాడుకోవాలంటే హైకోర్టే తమకు దిక్కుని అమె పేర్కోన్నారు. సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన కొడుకుపై జరిగిన దాడి ఘటనలో ఇంత జరిగినా అధికారులెవరూ స్పందించలేదని వెల్లడించారు. ఒక డాక్టరు తన అక్రోశాన్ని వెల్లగక్కితే ప్రభుత్వం ఇలా ప్రతీకారం తీర్చుకుంటుందా.? అని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడి ప్రభుత్వం తమను ప్రశ్నించే గొంతులను నులిమేస్తొందని అమె అందోళన వ్యక్తం చేశారు.

నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అనెస్థీషియన్ గా పనిచేసే డాక్టర్‌ సుధాకర్‌ .. ప్రభుత్వం పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని బహిరంగంగా గళమెత్తారు. ఆగ్రహించిన ప్రభుత్వం సుధాకర్ ను సస్పెండ్‌ చేసింది. ఆతర్వాత కొన్ని రోజులకు సుధాకర్‌ గుండుతో గుర్తుపట్టలేని విధంగా విశాఖలో రోడ్డుపై ప్రత్యక్షమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు సుధాకర్‌ను అరెస్టు చేసే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సుధాకర్‌ను లాఠీతో కొట్టడం, బలవంతంగా ఎత్తుకుని తరలించడం దుమారం రేపింది. సుధాకర్‌ మానసిక పరిస్థితి బాగోలేదంటూ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత  హైకోర్టుకు లేఖ రాయడంతో దానిని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం విచారణ చేపట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles