Coronavirus: Migrant workers lathi charged at guntur వలస కార్మికులపై విరిగిన లాఠీ..

Coronavirus migrant workers lathi charged at tadepalligudem of guntur

lathi charge migrant labour, lathicharge on migrant workers, lathi charge on labour, police lathi charge on migrant labour, police lathi charge on migrant workers, Guntur police lathi charge on migrant labour, guntur politce lathi charge on migrant workers, coronavirus updates, COVID-19, Lockdown, Coronavirus, Lockdown-4, National Politics

Central Government and Union Home Ministry had issued clear instuctions to states to send the Migrant workers who are interested to go to their native places amid lockdown. But in Andhra Pradesh Guntur district, Police had Lathi charged on Migrant workers at tadepalligudem of guntur.

వలస కార్మికులపై విరిగిన లాఠీ.. ప్రశ్నించలేని ప్రగతిశీలి గుండెకు గాయం..

Posted: 05/17/2020 01:34 PM IST
Coronavirus migrant workers lathi charged at tadepalligudem of guntur

భారత జాతీ ప్రగతికి పట్టుగొమ్మలు.. -దేశ అభ్యున్నతిలో మూలవిరాట్టులు.. వారే కార్మికులు, కూలీలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా బాసిల్లిన అమరావతి ప్రాంతంలో నిర్మితమవుతున్న నూతన నిర్మాణాలు, ప్రాజెక్టుల నిర్మాణాలలో తాము భాగమై పనిచేసేందుకు ఎక్కడి నుంచి వచ్చారు. దేశంలో కరోనా వైరస్ జడలు విప్పడంతో.. దానిని నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఒకటవ విడత లాక్ డౌన్ 21 రోజుల పాటు కొనసాగిన తరువాత 19 రోజుల పాటు రెండవ విడత లాక్ డౌన్ కొనసాగింపుగా వచ్చింది.

ఇక మూడో లాక్ డౌన్ అమలుతో వచ్చిన సడలింపులు వలస కార్మికులకు వరంగా పరిణమించాయి. వలస కార్మికులు తాము పనిచేస్తున్న పరాయి రాష్ట్రాల్లో బార్యబిడ్డలకు దూరంగా, కాలే కడుపులతో వుండలేక, స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. అంతేకాదు వారి కోసం ప్రత్యేకంగా రైళ్లను కూడా నడుపుతోంది. అయితే పలు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా వలస కూలీలు తమ గమ్యస్థానాలకు పయనం అవుతూనే వున్నారు. ఇక్కడ ఎన్ని రోజులు వున్నా.. అర్థాకలితో వుండటం.. తాము డబ్బును అర్జించేందుకు వచ్చినా.. ఇక్కడ అకస్మాత్తుగా డబ్బుకు లోటు ఏర్పడటం..గుత్తేదార్లు, కాంట్రాక్టర్లు వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో.. తాము తమ వారికి ఏం పంపాలన్న ప్రశ్నలు ఉదయించి.. కలో గంజో తమవారితో పంచుకుని తినడమే బాగుంటుందని స్వస్థలాలకు పయనం అయ్యేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఇలా నిర్ణయించుకుని అమరావతి ఆ పరిసర ప్రాంతంలో నూతన నిర్మాణాలు చేపట్టేందుకు వచ్చిన వలస కూలీలు.. స్వస్థలాలకు వెళ్తున్న నేపథ్యంలో వారిపై పోలీసుల లాఠీ విరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలసకూలీలపై మరోసారి పోలీసులు లాఠీలు జుళిపించారు. తమను వెంటనే స్వస్ధలాలకు పంపాలంటూ వలస కార్మికులు తాడేపల్లిలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వలస కార్మికులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. దీంతో వారు భయంతో పరుగులు పెట్టారు. తాడేపల్లి జాతీయ రహదారిపై నుంచి పోలీసులు వారిని స్ధానికంగా ఉన్న ఇళ్లకు పంపారు. అయితే పోలీసులు వలస కార్మికులపై లాఠీ ప్రయోగం చేయడం వివాదాస్పదమైంది.

నిన్న సాయంత్రం జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను అటుగా వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ గమనించి కారు దిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు.దీంతో రహదారిపై వెళ్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వెయ్యి మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు.

వీరిలో కొంతమంది కాలినడకన వెళ్లేవారు, మరికొందరు సైకిళ్లపై వెళ్లేవారు ఉన్నారు.ఈరోజు ఉదయం పునరావాస కేంద్రంలో అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో సైకిళ్లపై వచ్చిన కూలీలు కొందరు తిరుగు ప్రయాణమయ్యారు.సుమారు 150 మంది కూలీలు విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. అనంతరం వారందరినీ విజయవాడ క్లబ్‌కు తీసుకొచ్చి వివరాలు నమోదు చేసుకుంటున్నారు.

రాష్ట్రాలే వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చాలి: పవన్ కల్యాణ్

దేశ ప్రగతిలో భాగమైన వలస కార్మికులు.. లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్తున్న తరుణంలో వారిని గమ్యస్థలాలకు చేర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కోరారు. లాక్ డౌన్‌ కారణంగా పనులు లేక వలస కూలీలు స్వస్థలాలకు వెళుతూ మార్గమధ్యలోనే చనిపోవడం బాధాకరమన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన రోడ్డుప్రమాదాలను ఉదహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేటుచేసుకోకుండా.. వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని అన్నారు.

వలస కూలీలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. వారు పొట్ట చేత పట్టుకుని పనులు కోసం వచ్చినా.. దేశ అభ్యున్నతిలో భాగమవుతున్నారని అన్నారు. వారిని మనవారు కాదులే అనే విధంగా వ్యవహరించడం సరికాదని పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికాభివృద్ధిలో వలస కార్మికుల చెమట చుక్కల భాగస్వామ్యం ఉంది అన్న వాస్తవాన్ని విస్మరించకూడదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో ఛత్తీస్ గడ్‌, ఒడిశా, అసోం రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ గనుల్లో ఒడిశా కూలీలు పనిచేస్తున్నారని పవన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles