Visakhapatnam espionage case: NIA arrests key conspirator విశాఖ నావీ హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్..

Operation dolphin nose nia arrests key conspirator from mumbai for leaking vital navy information

National Investigation Agency, Mohammed Haroon Haji Abdul Rehman Lakdawala, Dolphin Nose, Special Intelligence Branch, Naval Intelligence, key conspirator, Mumbai, HoneyTrap, ISI. Pakistan, Crime

The NIA arrested 49-year-old Mohammed Haroon Haji Abdul Rehman Lakdawala, a Mumbai resident believed to be one of the key conspirators in Visakhapatnam espionage case. Lakdawala is the fourteenth arrest made in the operation code-named ‘Dolphin Nose’

ఆపరేషన్ డాల్పిన్ నోస్: హనీట్రాప్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్..

Posted: 05/16/2020 03:51 PM IST
Operation dolphin nose nia arrests key conspirator from mumbai for leaking vital navy information

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ విసిరిన హనీట్రాప్ లో ఎన్ఐఏ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా బావిస్తున్న అగంతకుడిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి నౌకదళ రహస్యాలను చేరవేసిన ఏడుగురు నేవీ సిబ్బందిని గతేడాది డిసెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’ దర్యాప్తులో భాగంగా ముంబైలో మొహమ్మద్‌ హరూన్‌ హజీ అబ్దుల్‌ రెహమాన్‌ లక్డావాలా(49) అనే వ్యక్తిని ఎన్ఐఏ శుక్రవారం అరెస్ట్ చేసింది. ఆపరేషన్ డాల్ఫిన్ నోస్‌లో ఇతడికి కీలక సూత్రధారిగా ఎన్ఐఏ నమ్ముతోంది. లక్డావాలా అరెస్ట్‌తో ఈ కేసులు అదుపులోకి తీసుకున్న నిందితుల సంఖ్య 14కి చేరింది.

‘సరిహద్దు వాణిజ్యం ముసుగులో అతడు కరాచీకి ఎన్నిసార్లు ప్రయాణించాడో పరిశీలిస్తే లక్డావాలా అరెస్ట్ చాలా ముఖ్యమైంది.. అక్కడ అక్బర్ అలియాస్ అలీ, రిజ్వాన్ అని పిలువబడే పాకిస్తాన్ గూఢచారులను కలిశాడు’ అని ఎన్ఐఏ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మొత్తం కేసులో లక్డావాలా పాత్ర చాలా కీలమైందని, నేవీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు వివిధ మార్గాల్ ద్వారా నగదు జమచేయడంలోనూ కీలకంగా వ్యవహరించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఈ రాకెట్ 2018లో ప్రారంభమైందని, 2019 డిసెంబరులో నిందితులను అరెస్ట్ చేశారు.

భారత నౌకాదళానికి చెందిన సబ్‌మెరైన్లు, యుద్ధనౌకల మొహరింపు సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్టు గత ఏడాది డిసెంబరు 20న ఏపీ నిఘా విభాగం బయటపెట్టింది. దీనికి ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’ అని నామకరణం చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు 14 మంది అరెస్టు కాగా.. వారిలో పాకిస్థాన్‌లో జన్మించిన షాయిస్తా క్వయిజర్‌ అనే యువతి కూడా ఉంది. తొలుత ఏడుగురు నేవీ ఉద్యోగులును అదుపులోకి తీసుకోగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

ఫేస్‌బుక్, వాట్సాప్, ఆన్‌లైన్ డేటింగ్ సైట్స్ ద్వారా నేవీ ఉద్యోగులను పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హానీట్రాప్ ద్వారా ఉచ్చులోకి లాగి నౌకా స్థావరాలు, జలంతార్గములు, యుద్ధ నౌకలకు సంబంధించిన రహస్యాలను పొందినట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ డేటింగ్ సైట్స్‌లో మహిళలను ఐఎస్ఐ ఎరగావేసి నేవీ సిబ్బంది ఆకర్షించింది. తరువాత సమాచారం సేకరించడానికి బ్లాక్‌మెయిల్‌‌కు పాల్పడ్డారు. ఒకవేళ సమాచారాన్ని ఇవ్వకపోతే మహిళలతో చాట్‌లను బహిర్గతం చేస్తామని బెదిరించినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఈ విధంగా నౌకా స్థావరాలు, కదలికల గురించి సమాచారాన్ని సేకరించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. లక్డావాలా ఇంటిలో అనేక ఆధారాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammed Haroon  Dolphin Nose  NIA  key conspirator  Mumbai  HoneyTrap  ISI. Pakistan  Crime  

Other Articles