Leopard venturing at Himayathsagar మైలార్‌దేవ్‌పల్లి టు హిమాయత్ సాగర్.. చిరుత సంచారం..

Leopard venturing on hyderabad outskirts evades forest authorities

leopard, himayath sagar, Reservoir, aziz nagar, moinabad, Rajendra nagar, RangaReddy, Telangana, Crime

The leopard which ventured into the city at Kattedan, managed to evade forest department officials and escaped from the farmland where it had taken refuge. The Locals identified the leopard at Himayath Sagar drinking water.

మైలార్‌దేవ్‌పల్లి టు హిమాయత్ సాగర్.. చిరుత సంచారం..

Posted: 05/16/2020 10:15 AM IST
Leopard venturing on hyderabad outskirts evades forest authorities

లాక్ డౌన్ తో రోడ్లు ఖాళీగా వున్నాయని.. హ్యాపీగా నిద్రించింది చిరుత.. ఆచూకీని ఎట్టకేలకు కనిపెట్టారు అధికారులు. తనకు అడ్డులేదని, తన దారికి ఎవరు ఎదురువచ్చినా.. లేక ఎదురైనా అవతలి ప్రాణికే హానీ అన్నట్లుగా నగరశివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి సమీపంలో రహదారిపైనే సేదతీరిన చిరుత.. జనసంచారం ప్రారంభం కాగానే పారిపోయింది. అటు అటవీశాఖ, ఇటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. బోనులో చిక్కకుండా, డ్రోన్లు, కెమెరాల కంట పడకుండా తప్పించుకున్న చిరుత అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది.

ఫామ్ హౌస్ ఏరియాలో చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు గాలించగా.. ఏడు అడుగుల ఎత్తయిన గోడ మీది నుంచి దూకి తప్పించుకొని పారిపోయింది. పాద ముద్రల ద్వారా చిరుత గోడ దూకి వెళ్లిందని అధికారులు నిర్ధారించారు. ఇక అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా చిరుత ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టకుండా.. దానిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. తాజాగా ఈ చిరుత ఆచూకీ రాజేంద్రనగర్ హిమాయత్‌సాగర్ వద్ద లభించింది. హిమాయత్ సాగర్ లో నీళ్లు తాగుతుండగా చిరుతను చూశామని స్థానికులు తెలిపారు.

ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు చెప్పిన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు, అటవీశాఖ అధికారులు.. హిమాయత్ సాగర్ వెనక వైపు ఉన్న అజీజ్ నగర్ ప్రాంతంలో చిరుత కోసం‌ గాలిస్తున్నారు. మైలార్ దేవ్ పల్లి వద్ద తొలిరోజు లారీ డ్రైవర్ పై చిరుత దాడి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. చిరుత నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి అటు ఇటు పరిగెత్తి.. చివరకు లారీ ఎక్కడానికి ప్రయత్నించగా.. ఈలోగా చిరుత అతడిపై దాడి చేసింది. ఈలోగా కుక్కలు అటుగా రావడంతో పరారైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : leopard  himayath sagar  Reservoir  aziz nagar  moinabad  Rajendra nagar  RangaReddy  Telangana  Crime  

Other Articles