MIM MLA removes barricades, BJP demand action భారీకేడ్లు తొలగించిన ఎమ్మెల్యే.. లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన

Malakpet mla abdullah balala violates lockdown rules removes barricades

coronavirus, coronavirus cases old city, coivd-19, AIMIM Malakpet MLA, Ahmed Bin Abdullah Balala, BJP MLA, Raja Singh, Greater Hyderabad, lockdown violations, CM KCR, Telangana, Politics

AIMIM Malakpet MLA Ahmed Bin Abdullah Balala reportedly violated lockdown norms and forced police to remove barricades put by the administration on Dabeerpura fly over in Hyderabad's old city.

భారీకేడ్లు తొలగించిన ఎమ్మెల్యే.. లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన

Posted: 05/16/2020 11:02 AM IST
Malakpet mla abdullah balala violates lockdown rules removes barricades

హైదరాబాద్లో ఎంఐఎం ఎమ్మెల్యే లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించడం వివాదాస్పదంగా మారుతోంది. ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. ప్రజాప్రతినిధిగా తాను ముందుగా ప్రభుత్వం జారీ చేసిన అదేశాలను పాటించాల్సిందిపోయి.. తానే దగ్గరుండి వాటిని ఉల్లంఘించడం వివాదాస్పదమవుతోంది. లాక్ డౌన్ లో రోడ్డుపై అడ్డంగా ఉంచిన భారీకేడ్లను తొలగించి వాహనదారులకు అనుమతిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బాలాలా దగ్గరుండి భారీకేడ్లు తొలగింపజేస్తుండడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డుగా ఏర్పాటు చేసిన భారీకేడ్లు తొలగింపజేసి వాహనదారులకు ఆయన స్వయంగా అనుమతించారు. ఇందుకు పోలీసులు కూడా సహకరించడం గమనార్హం. డబీర్‌పుర పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇక స్వయంగా ఎమ్మెల్యేనే భారీకేడ్లు తొలగించడంతో అక్కడే వున్న పోలీసులు చేష్టలుడికి చూస్తుండిపోయారు. దీంతో పోలీసులు కూడా స్వరం మార్చారు. ఎమ్మెల్యేపే లాక్ డౌన్ ఉల్లంఘనల కింద కేసు బనాయించాల్సిన పోలీసులు.. అందుకు భిన్నంగా తామే వాటిని తొలగించామని చెప్పడం గమనార్హం. దీనిపై డబీర్ పుర ఇన్ స్పెక్టర్‌ను బీజేపి స్థానిక నేతలు వివరణ కోరగా తామే భారీకేడ్లు తీయించినట్లు చెప్పారు.

పాత బస్తీలో ఎమ్మెల్యే నాయకుల దౌర్జన్యానికి హద్దు లేకుండా పోయిందని రూప్ రాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటీవల మాజీ మేయర్ పోలీసులను బెదిరించినా కేసు నమోదు చేయలేదని గుర్తు చేశారు. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఈ ఘటనలు సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనాను తరిమికొట్టేందుకు లాక్ డౌన్ పాటిస్తుంటే, హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎం నేతల వల్ల అది సాధ్యం కావడం లేదని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles