తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసులు వెలుగుచూసిన తొలినాళ్లలోనే విదేశాలకు వెళ్లి కర్ణాటకలోని తన కార్యాలయానికి వెళ్లి అటు నుంచి సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ కు వచ్చిన బాధితుడి ద్వారా రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన కేసులు మే నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. అయినా ఎలాంటి సడలింపులు లేకుండా ముందుకెళ్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మే 3వ తేదీ వరకు అంతా సవ్యంగానే సాగింది.
ఈ నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పాటిస్తూ మే నెల 6వ తేదీ నుంచి తెలంగాణలోనూ సడలింపులు ఇవ్వడంతో.. కరోనా మరోమారు పంజావిసురుతోంది. మే 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక దీనికి తోడు ప్రతిపక్షాల విమర్శలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. తెలంగాణలో కరోనా అనుమానితులకు టెస్టులు చేయడం లేదంటూ.. విపక్ష రాజకీయ పార్టీలు అరోపణలు కూడా చేస్తున్నాయి. ఈ విషయాన్ని అటుంచితే సడలింపులు కూడా తెలంగాణలో కరోనా కేసుల నమోదుకు పెరగడానికి మరోకారణంగా అరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులు తెలంగాణలో నమోదైన గరిష్ట కేసుల సంఖ్యగా తేలడం మరో అందోళకన విషయం. ఈ మొత్తం కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటివరకు 1275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 50 కాగా, కోలుకున్నవారి సంఖ్య 801కి పెరిగింది. ప్రస్తుతం 444 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, మరణాల సంఖ్య 30 అని తెలంగాణ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. అయితే ఒక్కసారిగా ఇంతలా కేసులు పెరగడానికి కారణం ఏంటన్న విషయమై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.
అయితే అనధికారక కథనాల ప్రకారం సరూర్ నగర్ లోని ఓ దుకాణం వ్యాపారికి మలక్ పేట్ గంజ్ నేపథ్యంలో కోరనా ప్రభావాన పడ్డాడని, అతని ఆ తరువాత తన స్నేహితుడి చిన్న పార్టీకి వెళ్లడంతో అక్కడ ఈ వైరస్ ఇతరులకు సోకిందని, దీనికి తోడు ఆ పార్టీలో చార్మినార్ నుంచి వచ్చిన పలువురికి కూడా కరోనా వుండటంతో ఇక ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణమైందని తెలుస్తోంది. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో అత్యధికం నగరంలోని జియాగూడలోనే నమోదైయ్యాయని సమాచారం. హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ నగరంగా ఖ్యాతిపోందుతున్న తరుణంలోనే కరోనా వైరస్ పంజా విసరడం.. నగర భవిష్యత్ అభివృద్దికి అవరోధంగా కూడా మారే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more