Advance Kharif Sowing Reported Across India ముందుగానే పలకరించనున్న తొలకరి.. రైతన్న ఫుల్ ఖుషీ..

Countdown monsoon 2020 starts augurs well to kick start with the andaman sea

monsoon,monsoon 2020,monsoon in india,monsoon rains in india,arrival of monsoon,arrival of monsoon in india,southwest monsoon,arrival of southwest monsoon,monsoon season in india,departure of monsoon from india,departure of southwest monsoon, India Meteorological Department (IMD), monsoon 2020, monsoon in india, southwest monsoon, Rains in India, Rain Alert, southern states, central India, IMD

The arrival of Monsoon and its four-month journey is considered a historic occurrence every time. The onset of monsoon is a much-awaited event, packed with a mix of anxious and exciting moments. Its truant behavior attaches both, the hope of success and fear of failure, till it unfolds completely in September.

ముందుగానే పలకరించనున్న తొలకరి.. రైతన్న ఫుల్ ఖుషీ..

Posted: 05/12/2020 11:15 AM IST
Countdown monsoon 2020 starts augurs well to kick start with the andaman sea

దేశ రైతాంగాన్ని వరుణుడు ఈ సారి ముందుగానే కరుణించాడు. పలు పర్యాయాలు వరుణ దేవుడా ఎప్పుడోస్తావు.. అంటూ రైతన్న కంటి రెప్ప వాల్చకుండా ఎదురుచూసినా నిరీక్షింపజేసే వరణుడు ఈ సారి మాత్రం రైతన్నను ముందుగానే పలకరించనున్నాడు. గతేడాది కంటే ఈసారి రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్ లోకి ప్రవేశించనున్నాయి. గతేడాది మే 18న అండమాన్ లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, ఈసారి 16నే  ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

కేరళ, తెలంగాణ సహా ఇతర దక్షిణాధి రాష్ట్రాలతో పాటు మధ్యభారతంలోని ప్రాంతాల్లో నైరుతి ఎప్పుడు ప్రవేశిస్తుందన్న దానిపై ఒకటి రెండు రోజుల్లో భారత వాతావరణ విభాగం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు నైరుతి రుతుపవనాలు ముందస్తుగా మే 25న ప్రవేశించగా ఇక ఆలస్యంగా జూన్ 6వ తేదీన ప్రవేశించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సాధరణ సగటున జూన్ 1 గా నమోదైంది. అయితే గత ఏడాది 18వ తేదీని అండమాన్ దీవుల్లోకి నైరుతి పవనాలు ప్రవేశించినా.. కేరళ రాష్ట్రంలోకి చేరేందుకు మాత్రం మరో వారం గడువును తీసుకుంది. దీంతో ఈ సారి వీటి ప్రవేశం కేరళలో ఎప్పటికి చేరుతుందా అన్న విషయమై మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం ఈ నెలలో తెలయిజేయనుంది,

ఇక దేశవ్యాప్తంగా ఇప్పటికే నైరుతి రుతుపవనాల తొలకరి జల్లులు ముందుగానే వస్తున్నాయన్న సమాచారంతో దేశ రైతంగం కూడా సన్నధమైంది. పొలం చదను చేసే పనులకు రైతన్న రెడీ అయ్యాడు. తొలకరి తొందరగానే పలకరిస్తుందన్న వార్తలతో.. తొలకరితో భూమి తల్లి తడవగానే విత్తనాలు చల్లి.. నాట్లకు సిద్దం కావాలని రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తాను సమకూర్చకున్న విత్తనాలను కూడా రెడీగా పెట్టుకున్నాడు. అయితే గతేడాదిలా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడం ఆలస్యమైతే ఏం చేయాలన్న దిగులు కూడా రైతన్నలలో మరోవైపు కనిపిస్తోంది. అయితే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సాధారణాన్ని మించిన వర్షపాతం నమోదువుతుందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles