Cases will peak in July in India, says WHO expert దేశంలో జూలై నాటికి అత్యధిక కరోనా కేసుల నమోదు

Corona cases in india will peak by july end but will get better says who envoy

India, lockdown, David Nabarro, pandemic, coronavirus cases, coronavirus peak in India, Coronavirus India, World Health Organisation, Coronavirus, Covid-19, Spanish flu, SARS-CoV-2 RNA, corona positive cases in July

The World Health Organization’s special Covid-19 envoy David Nabarro said India has reported a relatively small number of coronavirus cases till now because it acted quickly. In an interview with NDTV, the health expert said the pandemic will reach its peak in the country by the end of July before it is contained.

దేశంలో జూలై నాటికి అత్యధిక కరోనా కేసుల నమోదు: ప్రపంచ అరోగ్య సంస్థ

Posted: 05/09/2020 01:11 PM IST
Corona cases in india will peak by july end but will get better says who envoy

మానవాళి ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తూ.. మనిషి మనుగడకు పెను సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ అప్పుడే ఆరు నెలలు గడిచింది. ఎండకాలం కూడా రమారమి పూర్తి కావస్తోంది. ఆ తరువాత వర్షాకాలంలో సాధరణంగానే వైరస్ ఫ్లూలు, అతిసారవ్యాధులతో పాటు అంటువ్యాధులు ప్రబలే కాలం. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి జూలై నెలలో మరింత వేగంగా విస్తరించే అవకాశాలు వుంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) రాయబారి డేవిడ్‌ నబారో అంచనా వేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి వేగవంతంగా చర్యలు తీసుకోవడం వల్ల తక్కువ నష్టమే కలిగిందని అన్నారు.

అంతకంటే ముందు కొన్నిరోజుల పాటు కొత్త కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతాయని తెలిపారు. లాక్ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కేసుల సంఖ్య కొంతకాలం పెరుగుతుందని.. అయినా భయడపడాల్సిన అవసరం లేదని నబారో స్పష్టం చేశారు. అక్కడక్కడ పెరిగినప్పటికీ.. క్రమంగా కట్టడిలోకి వస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ సత్ఫతాలిచ్చిందని.. దీనివల్ల వైరస్‌ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండడంపై నబారో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. జనాభాతో పోలిస్తే ఇప్పటి వరకు నమోదైన కేసులు చాలా తక్కువేనని అభిప్రాయపడ్డారు.

దేశంలో వృద్ధుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల మరణాలు రేటు కూడా చాలా తక్కువగా నమోదవుతుందని వివరించారు. ప్రపంచ అరోగ్య సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలపై ప్రస్తావిస్తూ.. ఓ అధ్యక్షుడు లేదా ప్రధాన మంత్రి.. తమ సంస్థ పనితీరుపై ఆరోపణలు గుప్పించడం వల్ల వైరస్ పై చేస్తున్న పోరు ఆగిపోదని స్పష్టం చేశారు. చైనాకు సంస్థ అనుకూలంగా పనిచేస్తుందన్న ట్రంప్‌ విమర్శలు డబ్ల్యూహెచ్‌ఓ సాధారణ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపారు. మహమ్మారిని కట్టడి చేసే లక్ష్యం నుంచి సంస్థ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles