Locals Face New Problems after inhailing poisonous gasఎల్జీ పాలీమర్స్ గ్యాస్ బాధితుల్లో కొత్త ఆరోగ్య సమస్యలు

Vizag gas tragedy locals face new problems after inhailing poisonous gas

lg polymers, lg polymers gas leakage, visakhapatnam lg polymers, HIgh Power committee, YS Jagan, visakhapatnam lg polymers gas leak, lg polymers visakhapatnam gas leak, lg polymers vizag gas leak, lg polymers gas leakage, lg polymers gas leakage news, lg polymers gas leakage latest news, lg polymers gas leakage today news, visakhapatnam lg polymers gas leakage news

Residents of RR Venkatapuram and adjoining villages in Visakhapatnam who inhailed poisonous gas which leaked and fall ill are facing a new health problems.

ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ బాధితుల్లో కొత్త ఆరోగ్య సమస్యలు

Posted: 05/09/2020 02:06 PM IST
Vizag gas tragedy locals face new problems after inhailing poisonous gas

విశాఖలో విషవాయువు లీక్ కావడంతో ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతంలోని ఐదు గ్రామాల్లోని చెట్లు చేమలు పూర్తిగా వర్ణం మారిపోయాయి. ఈ తరుణంలో ఈ గాలిని పీల్చి అస్వస్థతకు గురైన బాధితుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి, బాధితులపై ఈ విషవాయువులు పీల్చిన ప్రభావం వైద్యంతో నయం అవుతుందా.? లేక వారి జీవితకాలం వారిని వెన్నాడుతోందా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ తరహా ప్రశ్నలు ఉత్పన్నమై ఏకంగా ఐదు గ్రామాలవారిలో అందోళన రెకెత్తుతోంది.

ఇక విషవాయువులు పీల్చిన వారిని ఇప్పుడు కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ విష రసాయన గాలిని పీల్చిన 554 మంది బాధితుల్లో 52 మంది చిన్నారులే ఉన్నారు. దీంతో వీరిపై దీని ప్రభావం జీవిత కాలం వుంటే ఎలా అన్న అందోళన బాధితుల్లో వ్యక్తం అవుతోంది. కాగా, ఆ అందోళనలకు బలం చేకూర్చుతూ రసాయనక గాలి పీల్చిన బాధితుల్లో దీని ప్రభావం ఇప్పుడే కనబడుతోంది. బాధితుల శరీరం కమిలిపోతుంది. కొందరికి ఒంటిపై బబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.

తొలుత శరీరంపై దురద, మంట ఏర్పడుతోందని అనంతరం చర్మం కమిలిపోయి బబ్బలు వస్తున్నాయి. దీంతో చర్మవ్యాధుల నిపుణులు వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో స్పందించిన వైద్యులు వారికి కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. గురువారం ఎల్‌జిపాలిమర్స్‌ కంపెనీ నుండి విషవాయువు లీకైన ఘటనలో పలువురు ఆస్పత్రి పాలైనసంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles