telangana govt travel ban to AP and Maharashtra తెలంగాణవాసులకు సర్కార్ సూచనలు.. ఏపీ, మహరాష్ట్రలకు వెళ్లోద్దు..

Telangana government travel ban to andhra pradesh and maharashtra

covid-19, coronavirus, coronavirus in Telangana, coronavirus in Andhra Pradesh, coronavirus in Maharashtra, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

Telangana government passes retriction to the people ot Telangana in the wake of coronavirus, keeps travel ban to Andhra Pradesh and Maharashtra as coivd-19 is in full spike there.

తెలంగాణవాసులకు సర్కార్ సూచనలు.. ఏపీ, మహరాష్ట్రలకు వెళ్లోద్దు..

Posted: 05/01/2020 11:57 AM IST
Telangana government travel ban to andhra pradesh and maharashtra

దేశంలో కరోనా వ్యాధి నమోదైన తొలినాళ్లలోనే తెలంగాణకు వచ్చిన మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేసి.. సఫలీకృతం అయిన తెలంగాణ స్కరార్.. తాజాగా తమ రాష్ట్రప్రజలకు అప్రమత్త సూచనలు చేసింది. రాష్ట్రంలో తాజాగా గ్రేటర్ హైదారాబాద్ పరిధిలో 22 కరోనా కేసులు నమోదయ్యాయని తెలియడంతో అఘమేఘాల మీద ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి.. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు గ్రేటర్ అధికారులను కూడా అదేశించారు.

ఇక ఇదే సమయంలో గ్రేటర్ మినహాయించగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కరోనా వైరస్ జాడ లేకుండా చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా సూచనలు చేసింది. పోరుగున్న రెండు రాష్ట్రాల్లో కరోనా విజృంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా రెండు జిల్లాలకు వెళ్లవద్దని సూచనలు చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోందని.. అదే విధంగా పోరుగున్న మరో తెలుగు రాష్ట్రం అంధ్రప్రదేశ్ లోనూ కరోనా మహమ్మరి కట్టలు తెంచుకుని వ్యాప్తిచెందుతుందన్న విషయం తెలిసిందే.

దీంతో తెలంగాణ ప్రజలతో పాటు ఆయా రాష్ట్రాల సరిహద్దులో నివసించే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. సరిహద్ద ప్రాంతాల ప్రజలకు ఆయా రాష్ట్రాలకు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. సరిహద్దు ప్రాంతాల ప్రజలు అత్యవసర సమయాల్లో కూడా రాష్ట్ర సరిహద్దు దాటేందుకు వీలులేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎంతటి విపత్కర సమయంలోనైనా రాష్ట్రానికి చెందిన సేవలను మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. ఇక రాష్ట్రం నుంచి సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే దారుల్లో భారగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది.

మరీ ముఖ్యంగా ఉమ్మడి మహమబూబ్ నగర్ జిల్లా నుంచి కర్నూలుకు వెళ్లేవారిని కట్టడి చేయాలని ప్రభుత్వం అధికారులను అదేశించింది. కర్నూలులో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ మేరకు అదేశాలు తీసుకుంది. దీంతో పాటు అటు ఖమ్మం, నల్గోండ జిల్లాల ప్రజలు గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు కూడా వెళ్లకుండా కట్టుదిట్టమైన బధ్రతను ఏర్పాటు చేయాలని పోలీసులను అదేశించింది. ఏపీలోని కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా నమోదు కావడం కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు అదేశాలను జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles