7 new covid cases in Telangana during last 24 hours తెలంగాణలో మళ్లీ బుసకొడుతున్న కరోనా.. కొత్తగా 22 పాజిటివ్ కేసులు.. 3 మృతి

Covid 19 update 22 new positive cases three deaths in telangana

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

State health authorities have reported 22 new coronavirus positive cases and three fatalities due to Covid-19. The overall number of Covid-19 cases in Telangana rose to 1038 while the recovery rate continued to improve with authorities discharging 33 more persons taking the total number of discharged persons to 442.

తెలంగాణలో మళ్లీ బుసకొడుతున్న కరోనా.. కొత్తగా 22 పాజిటివ్ కేసులు.. 3 మృతి

Posted: 05/01/2020 11:02 AM IST
Covid 19 update 22 new positive cases three deaths in telangana

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటం అందోళనకరంగా మారుతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కాసింత ఊరట పోందుతున్న అధికారుల్లో పెరుగుతున్న కేసులు మళ్లీ టెన్షన్ పెంచుతున్నాయి. గురువారం ఒక్కరోజునే ఏకంగా 22 కేసులు నమోదుకావడం.. ఇక నమోదైన కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం. ఇక తాజా కేసుల నమోదుతో మొత్తంగా తెలంగాణలో ఇప్పటి వరకు ఏకంగా 1038 కరోనా కేసులు నమోదయ్యాయి, ఇక తాజాగా నిన్న మూడు మరణాలు కూడా సంభవించాయి, దీంతో మరణాల సంఖ్య కూడా 28కి చేరింది.

 తాజాగా నమోదైన కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటికే తెలంగాణలో నమోదైన మొత్తం కేసులలో రమారమి యాభై శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనే నమోదైనవే. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు, కరోనా బాధితుల నుంచి ఎవరెవరికి వైరస్ సోకిందా అన్న వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే తాజా కేసుల్లో మార్కెట్లో పనిచేస్తున్న వారి ద్వారా పలువురికి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లుగా అధికారులు గుర్తించారు.

మలక్ పేట గంజ్ లో పనిచేస్తున్న పహాడీషరీఫ్‌, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల ద్వారా మార్కెట్లో మరో మూడు షాపుల యజమానులకు ఈ వైరస్‌ సోకిందని నిర్థారించుకున్నారు. తద్వారా వారి కుటుంబసభ్యులకూ కొవిడ్‌ వ్యాప్తి చెందడంతో వారందరినీ ఐసోలేషన్ లో ఉంచారు. మలక్ పే గంజ్‌, పహాడీషరీఫ్‌లను కంటెన్మైంట్ జోన్ గా ప్రకటించారు. ఇక మళ్లీ రాష్ట్రంలో అందులోనూ రాజధానిలో కరోనా బుసకొడుతుందని తెలియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అప్రమత్తం చేశారు, రాష్ట్ర వైద్య అరోగ్య అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని అదేశించారు, ఇక రాష్ట్రంలో తాజాగా నమోదైన మరణాల్లో మృతులందరూ దీర్ఘకాలిక అనార్యోగ సంబంధాలతో బాధపడుతున్నారని, కరోనా సోకడంతో వారు అందోళనకు గురికావడంతో వారి శరీరం చికిత్సకు సహకరించక మరణించారని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles