MHA order on shops: What's open, what's closed దుకాణాలు తెరుస్తున్నారా.. షరతులు వర్తిస్తాయి: కేంద్ర హోంశాఖ

Covid 19 local shops set to re open as mha further eases lockdown guidelines

Delhi CM, Arvind Kejriwal, Shops Open, Delhi Health Minister, Satyendar Kumar Jain, Shops Open, Central Government, Home Ministry, Lockdown, coronavirus lockdown, coronavirus delhi, coronavirus cases, india, coronavirus, lockdown New Guidelines, Delhi lockdown Guidelines, Delhi News

The central government's late-night order to allow all shops to reopen in residential areas - except those in malls - amid a nationwide lockdown over coronavirus may not have much impact in Delhi that has 92 containment zones. Union Home Ministry made it clear that the exemptions are not allowed in the hotspots.

దుకాణాలు తెరుస్తున్నారా.. షరతులు వర్తిస్తాయి: కేంద్ర హోంశాఖ తాజా ఉత్తర్వులు

Posted: 04/25/2020 02:24 PM IST
Covid 19 local shops set to re open as mha further eases lockdown guidelines

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో దానిని కట్టడి చేసేుందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అత్యవసర సర్వీసులు మినహా అన్ని సేవలు మూతపడ్డాయి. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఇక్కడి ప్రజలు అకలితో అలమటించకుండా పలు మినహాయింపులు ఇచ్చారు. అయితే పలు రాష్ట్రాల్లో మాత్రం లాక్ డౌన్ ఏకంగా కర్ప్యూను తలపిస్తోంది. తాజాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ పలు దుకాణాలు తెరిచేందుకు మినహాయింపులు కల్పించింది.

కొన్ని షరతులపై స్థానిక దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తూ నిన్న అర్ధరాత్రి  కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.హోం శాఖ ఆదేశాల ప్రకారం... ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ‘షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్ల్‌’ పరిధిలోకి వచ్చే రిజిస్ట్రేషన్‌ కలిగిన అన్ని దుకాణాలను ఇకపై తెరవవచ్చు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోకి వచ్చే నివాస సముదాయాలు, ప్రాంతాల్లోని అన్ని దుకాణాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.

ఇక సింగిల్ బ్రాండ్‌ లేదా వివిధ బ్రాండ్‌ల వస్తువులను విక్రయించే మాల్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లలో ఉండే దుకాణాలు తెరిచేందుకు మాత్రం అనుమతి లేదని ఆ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ సడలింపులు హాట్‌ స్పాట్లు, రెడ్ జోన్లు, కంటైన్‌మెంట్‌ ప్రాంతాలకు వర్తించవు. ఇక్కడ గతంలో విధించిన నిషేధాజ్ఞలు యథాతథంగా కొనసాగుతాయి. ఇక దుకాణదారులు 50 శాతం సిబ్బందిని మాత్రమే వినియోగించాలని, పనిసమయంలో మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటం తదితర జాగ్రత్తలు తప్పనిసరి అని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే దిల్లీలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles