Rajinikanth's fan killed Vijay's fan హద్దులు మీరిన అభిమానం.. హీరో విజయ్ ఫ్యాన్ మృతి

Fan war in chennai rajinikanth s fan killed vijay s fan

Thalapathy Vijay, RajiniKanth, Dinesh Babu, Yuvraj, Marakkanam, Chennai, puducherry medical college, neighbours, Tamil Nadu, Crime

The controversy over actor Rajinikanth and Vijay’s alleged coronavirus relief has resulted in the murder. The dramatic events took place at the Marakkanam in Chennai. The players contributed immensely to the Covid defense. Rajinikanth is an ardent fan. Dinesh Babu attacks Yuvraj, Vijay fan He died instantly. The body has been sent to the private medical college in Puducherry. Dinesh Babu is in police custody.

హద్దులు మీరిన అభిమానం.. ఘర్షణలో హీరో విజయ్ ఫ్యాన్ మృతి

Posted: 04/25/2020 03:12 PM IST
Fan war in chennai rajinikanth s fan killed vijay s fan

కరోనా వైరస్ ఓ వైపు వ్యాప్తి చెందుతూ మనుషులను చంపుతూ వుంటే.. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో తమ అభిమాన హీరోలు ఇచ్చిన విరాళాల విషయం కూడా ప్రణాలను తీస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో వున్న నేపథ్యంలో ఎవరి ఇళ్లలో వారు వుండాలని ప్రభుత్వాలు, పాలకులు, పోలీసులు, అభిమాన హీరోలు చెబుతున్నా.. ఈ విషయాన్ని పట్టించుకోని అభిమానులు.. వారి హీరోలు ఇచ్చిన విరాళాల విషయంలో మాటమాట పెరిగి ప్రాణాలను తీసుకునేవరకు వెళ్లారు. మా హీరో గొప్పంటే, కాదు మా హీరోనే గొప్పంటూ ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన వివాదం ముదిరి ఒకరి ప్రాణాలు బలిగొంది.

తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరక్కానంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. యువరాజ్ అనే యువకుడు హీరో విజయ్‌కు వీరాభిమాని. అతడి మిత్రుడు అయిన దినేశ్ బాబుకు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ప్రాణం. ఇద్దరు మంచి మిత్రులే అయినప్పటికీ అభిమాన హీరోల విషయానికి వచ్చేసరికి ఇద్దరూ శత్రువులే. ఇదిలావుంటే కరోనా వైరస్‌పై పోరులో కదిలొస్తున్న నటులు తమకు తోచినంతగా విరాళాలు ప్రకటిస్తూ బాధితులకు చేయూత అందిస్తున్నారు. సరిగ్గా ఇదే మిత్రుల మధ్య కయ్యానికి కారణమైంది. విరాళాల గురించి వీరి మధ్య చర్చ జరిగింది.

ఈ క్రమంలో తమ హీరో పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడంటే, కాదు తమ హీరోనే ఇచ్చాడంటూ ఇద్దరూ వాదులాడుకున్నారు. అది కాస్తా ముదరడంతో ఇద్దరూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన దినేశ్‌బాబు.. యువరాజ్‌ను గట్టిగా నెట్టేయడంతో అతడు ఒక్కసారిగా కిందపడ్డాడు. దీంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిత్రుడు చనిపోవడంతో షాకైన దినేశ్ బాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దినేశ్‌బాబును నిన్న అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles