coronavirus cases reported to 945 in Telangana తెలంగాణలో నెమ్మదించిన కోరానా.. 24 గంటల్లో 17 కరోనా కేసులు..

17 new coronavirus cases reported in telangana as of 9 00 am apr 23

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

17 new coronavirus cases were reported as of98:00 AM on Apr 23 in Telangana, according to data released by the Ministry of Health and Family Welfare. This brings the total reported cases of coronavirus in Telangana to 945. Among the total people infected as on date, 194 have recovered and 23 have passed away.

తెలంగాణలో నెమ్మదించిన కోరానా.. 24 గంటల్లో 17 కరోనా కేసులు..

Posted: 04/23/2020 11:47 AM IST
17 new coronavirus cases reported in telangana as of 9 00 am apr 23

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి నెమ్మదించింది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలితానిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కేవలం 17 కరోనా కేసులు మాత్రమే పిర్యాదు కావడంతో అధకిారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖ పడుతాయని రాష్ట్ర అరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇదివరకు ఆశాభావం వ్యక్తం చేసినట్టే కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో తెలంగాణవాసుల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది.

ఇక తాజా పెరుగుదలతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 945కు చేరింది. కాగా, తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో అత్యదికం రాజధాని హైదరాబాద్ లోనే కావడం గమనార్హం. దీంతో కావడం గ్రేటర్ హైదరాబాద్ వాసులు కూడా తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 175 మంది చిన్నారులపై తన ప్రభావాన్ని చాటుతున్న మమమ్మారి ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తన కంబంధహస్తాలలోకి ఎక్కువ మందిని వ్యాపించేలా చేస్తోంది. 345కి పైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదు అయ్యాయి. మొత్తం 194 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో హైదరాబాద్ తరువాత సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో అత్యధిక కోవిడ్ కేసులను నమోదు చేసుకున్నాయి. ఇవాళ కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 10, సూర్యాపేట జిల్లాలో 3, గద్వాల జిల్లాలో 2 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ బుటెటిన్‌లో ప్రకటించింది. ఇవాళ ఒక్కరు మృతి చెందడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 24కి చేరిందని ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 945కి చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 194 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా..725 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles