World has ‘a long way to go’, warns WHO కోవిడ్ను తేలిగ్గా తీసుకోవద్దు.. నిర్లక్ష్యం వహించవద్దు: డబ్యూహెచ్ఓ

World has a long way to go warns who chief

WHO, Tedros Adhanom Ghebreyesus, Coronavirus, World Health Organisation, Covid-19, Winter Season, Flu, US, UK, Africa, Asia, India, long time

The director general of the World Health Organization says there is still “a long way to go” in tackling the pandemic. Dr Tedros Adhanom Ghebreyesus says that, while most national epidemics in western Europe appear to have stabilised or are declining, outbreaks appeared to be growing in Africa, Central and South America, and eastern Europe.

కోవిడ్-19ను తేలిగ్గా తీసుకోవద్దు.. నిర్లక్ష్యం వహించవద్దు: డబ్యూహెచ్ఓ

Posted: 04/23/2020 02:02 PM IST
World has a long way to go warns who chief

మానవాళి మనుగడకు సవాల్ విసురుతూ వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం భూమిపై చాలా కాలం పాటే వుంటుందని ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోవిడ-19 ను తేలిగ్గా తీసుకోకూడదని, కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించవద్దని సూచనలు చేసింది. కొన్ని దేశాలు ఈ వైరస్‌ అదుపులోకి వచ్చిందని భావిస్తున్నప్పటికీ.. కొత్తగా మళ్ళీ పుంజుకోవడం చూస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ వెల్లడించారు. ‘తప్పు చేయొద్దు, ఈ వైరస్‌ సుదీర్ఘకాలం మనతోనే ఉంటుందని’ ప్రపంచ దేశాలను హెచ్చరించారు.

చాలా దేశాలు లాక్‌డౌన్‌ ను సడలించాలని అనుకుంటున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి అప్రమత్తం చేసింది. అయితే, మహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా దేశాలు ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రానున్న కాలంలో ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుతం పశ్చిమ యూరోప్ దేశాల్లో కరోనా వైరస్‌ తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ.. ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాతో పాటు తూర్పు యూరోప్ దేశాల్లో ఈ వైరస్‌ తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మొదట్లో కరోనా బారినపడ్డ దేశాల్లో వైరస్‌ తీవ్రత తగ్గిందని భావిస్తున్నప్పటికీ మళ్లీ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న విషయం గమనించాలన్నారు.

కరోనా తీవ్రతను ఆదిలోనే పసిగట్టి సరైన సమయంలోనే (జనవరి 30వ తేదీనే) అంతర్జాతీయ ఎమర్జన్సీ ప్రకటించిందని వెల్లడించారు. దీంతో అన్ని దేశాలకు సన్నద్ధమయ్యేందుకు చాలా సమయం ఉందనే విషయాన్ని నొక్కిచెప్పారు. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓ సరైన సమయంలో స్పందించిందని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కరోనా వైరస్ ను నియంత్రించే క్రమంలో సరిగా వ్యవహరించని కారణంగా డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ పదవికి రాజీనామా చేయాలని అమెరికా చేసిన వ్యాఖ్యలను టెడ్రోస్‌ తిరస్కరించారు. డబ్ల్యూహెచ్ఓకు నిధుల నిలిపివేతపై నిర్ణయాన్ని అమెరికా పునఃపరిశీలిస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 26లక్షల మంది ఈ వైరస్‌ బారిన పడగా లక్షా 80వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles