Ex Karnataka CM's Son Gets Married Without Hassle నిరాడంబరంగా మాజీ సీఎం కుమారస్వామి తనయుడి వివాహం..

Kumaraswamy s son married congress leader s daughter in vvip wedding amid lockdown

containment zones, Corona cases, Coronavirus, COVID-19, Coronavirus, COVID-19, Deve Gowda, Kumaraswamy, Anitha Kumaraswamy, Nikhil Gowda, Revathi, Marriage, lockdown, red zones, coronavirus in india, coronavirus in karnataka

Amid charges and counter-charges between Karnataka's ruling BJP and the opposition Janata Dal-Secular (JD-S), police denied lockdown violations at the wedding of former Chief Minister H.D. Kumaraswamy's son Nikhil Gowda with Revathi at a farmhouse near Bidadi in Ramanagara district

నిరాడంబరంగా కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ వివాహం..

Posted: 04/17/2020 03:58 PM IST
Kumaraswamy s son married congress leader s daughter in vvip wedding amid lockdown

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్ (సెక్యూలార్) పార్టీ అధినేత కుమారస్వామి తనయుడి వివాహం నిరాడంబరంగా జరిగింది. సినీనటుడు నిఖిల్ గౌడ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అనుకున్న కుమారస్వామి ఆశల పై 'లాక్ డౌన్‌' నీళ్లు చల్లింది. లాక్ డౌన్‌ పొడిగింపు తప్పకపోవడంతో ఆంక్షల నేపథ్యంలో రాంనగర్ జిల్లాలోని బిడాడీ ఫాంహౌస్‌లో నిరాడంబరంగా పెళ్లి తంతును ఇవాళ పూర్తి చేశారు. పెళ్లిలో జరగాల్సిన సంప్రదాయ ఉత్సవాలన్నింటినీ రద్దు చేసి కేవలం ప్రధాన కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తున్నారు.

కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడకు, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.క్రిష్ణప్ప మనుమరాలుకు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 17వ తేదీన అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలని అప్పుడే నిర్ణయించారు. ఈలోగా లాక్‌డౌన్‌ వచ్చిపడినప్పటికీ ఈనెల 14వ తేదీతో ముగియనున్నందున పెళ్లికి ఇబ్బంది లేదని రెండు కుటుంబాల వారూ భావించారు.

కానీ లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించడం, లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు భారీ ఫంక్షన్లకు అవకాశం లేకపోవడంతో పరిమిత సంఖ్యలో అతిథులతో ఫాంహౌస్‌లో పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుమార్ స్వామి మాట్లాడుతూ పెళ్లి వేడుకకు తమ రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత ముఖ్యమైన అతిథులు తప్ప మరెవరినీ ఆహ్వానించలేదని, నాయకులు, శ్రేణులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని పెళ్లి మండపం వద్దకు రావద్దని కోరారు. అదే సమయంలో తన కొడుకును ఇళ్ల నుంచే మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  COVID-19  Deve Gowda  Kumaraswamy  Anitha Kumaraswamy  Nikhil Gowda  Revathi  Marriage  lockdown  

Other Articles