Odisha govt extends lockdown till April 30th ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్న తొలి రాష్ట్రం

Naveen patnaik government extends lockdown in odisha till april 30

coronavirus in india, coronavirus, covid-19, Lockdown, New Delhi, Markaj, nizamuddin, religious events, Tablighi Jamaat, Markaj nizamuddin, religious events, foreigners, passports seize, visa cancelled, coronaviru update, coronavirus, coronavirus news, coronavirus, coronavirus tips, stages of coronavirus, coronavirus stages, coronavirus cases in india, coronavirus update worldwide, coronavirus symptoms, coronavirus cases, symptoms of coronavirus, coronavirus outbreak, coronavirus outbreak in india, coronavirus outbreak update, coronavirus outbreak reason, coronavirus outbreak news, coronavirus outbreak in us, india lockdown day 9, coronavirus in india latest news

The government of Odisha has decided to extend the lockdown- meant to end on April 14 - till April 30, according to PTI. Schools will remain closed up till June 17. This makes it the first state to officially extend the three-week lockdown announced by Prime Minister Narendra Modi in late March.

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్న తొలి రాష్ట్రం

Posted: 04/09/2020 12:51 PM IST
Naveen patnaik government extends lockdown in odisha till april 30

ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతూ వేలాది మందిని పోట్టనబెట్టుకున్న కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించడంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు.. ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించాయి. అయితే మార్చి 24 నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనుంది, అయితే ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ఘటనతో దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేగుతూ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో లాక్ డౌన్ పోడగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రధాన మంత్రికి ఈ మేరకు విన్నవించాయి,

ఈ నేపథ్యంలో లాక్ డౌన్‌ కొనసాగింపుపై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే లాక్ డౌన్ ఎత్తివేసే సూచనలు కనిపించడం లేదన్న సంకేతాలను ఇప్పటికే వెలువరించిన కేంద్రం.. అటు అఖిల సక్ష సమావేశంలోనూ ఈ విషయమై చర్చించింది. ఇక 11వ తేదీన జరగే ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ మేరకు కేంద్రం నిర్ణయం వెలువరించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా కేంద్రం నిర్ణయాన్ని అటుంచితే లాక్ డౌన్ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కొవిడ్‌-19ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రజల ప్రాణాలు.. ఆర్థిక స్థిరత్వం కంటే ముఖ్యమైనవని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కూడా కోరినట్టు నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. ఒడిశాలో విద్యా సంస్థలకు జూన్‌ 17 వరకు సెలవులు ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్‌డౌన్‌ కొనసాగింపు నిర్ణయాన్ని ఒడిశా ప్రభుత్వం తీసుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles