Telangana DGP finds place in list of top 25 IPS Officers తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి అరుదైన గౌరవం..

Telangana dgp mahender reddy finds place in list of top 25 ips officers

Telangana DGP, Mahender Reddy, IPS officer, Top Best IPS officer, Cyberabad police commissioner, Director Geneeal of Police, Telangana Police Telangana, Politics

Himachal Pradesh Governor Bandaru Dattatreya on Wednesday congratulated Telangana Director General of Police M Mahender Reddy for finding a place in a list of the top IPS officers in the country.

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి అరుదైన గౌరవం.. ఉత్తమ ఐపీఎస్ అధికారిగా..

Posted: 04/08/2020 01:18 PM IST
Telangana dgp mahender reddy finds place in list of top 25 ips officers

తెలంగాణ పోలీస్ బాస్ (డీజీపీ) మహేందర్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను అత్యత్తుమ ఐపీఎస్ అధికారులలో ఒకరిగా నిలిపింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లలో ఆయన 8వ స్థానంలో నిలిచారు. ఫేమ్‌ ఇండియా, ఆసియా పోస్ట్, పీఎస్‌యూ వాచ్‌ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ జాబితాను విడుదల చేశాయి. భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అర్వింద్‌ కుమార్‌ తొలి స్థానంలో నిలువగా, రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ (రా) చీఫ్‌ సమత్‌ కుమార్‌ గోయల్, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డీజీ ఎస్‌ఎస్‌ దేశ్వాల్‌ టాప్-3లో నిలిచారు.

ఆ తరువాత నాలుగో స్థానంలో సీఆర్‌పీఎఫ్‌ డీజీ మహేశ్వరి, 5వ స్థానంలో ఎన్ఎస్జీ చీఫ్‌ అనూప్‌ కుమార్‌ సింగ్, ఆరవ స్థానంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్‌ఎన్‌ సిన్హా, 7వ స్థానంలో బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే నిలిచారు. 1995కు ముందు బ్యాచ్ లలోని 4 వేల మంది అధికారుల పనితీరును సమీక్షించి, ఈ జాబితాను సిద్ధం చేశామని, పనితీరు, విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని జాబితాను విడుదల చేసిన సంస్థలు పేర్కొన్నాయి.

నేరాల కట్టడి, నిజాయతీ, నిష్పక్షపాతంగా విధి నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, ఫ్రెండ్లీ పోలీసింగ్, భాధ్యతాయుత విధులు తదితరాలను కూడా మదించామని వెల్లడించాయి. ఈ జాబితాను పీఎస్‌యూ వాచ్‌ వెబ్‌సైట్‌ ప్రచురించింది. కాగా, ఉత్తమ ఐపీఎస్‌ అధికారుల జాబితాలో తనకు చోటు దక్కడం మొత్తం తెలంగాణ పోలీసు సిబ్బందికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసు విభాగంలోని హోమ్ గార్డు నుంచి ఐపీఎస్‌ అధికారి వరకు ప్రతి ఒక్కరి సంకల్పం, పట్టుదల దీని వెనకున్నాయని అభివర్ణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles