Woman and her boy friend held for Husband Murder 22 ఏళ్ల చిన్నవాడైన ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య

Wife murders his husband along with 22 year younger boyfriend

woman kills husband, husband killed by wife boy friend, Woman and her boy friend held for Murder, wife murder husband with her boy friend, dehradun, extra marital affair, wife and her boy friend, done hus band murder, Love affiar in vikas nagar, coronavirus, COVID-19, chitoot Crime

Recently, a new case of crime has come out from Juddli Aduwala village in Vikasnagar, Dehradun, where a man was murdered by his own wife along with his lover. The police has disclosed this fact within 24 hours after the incident.

22 ఏళ్ల చిన్నవాడైన ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య

Posted: 04/07/2020 09:16 PM IST
Wife murders his husband along with 22 year younger boyfriend

అక్రమ సంబంధాల మోజులో పడి తాళికట్టిన వారిని కడతేర్చుతున్న వారి సంఖ్య రానురాను పెరుగుతూ పోతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగుచూసిన ఇలాంటి ఘటనను మర్చిపోకముందే అలాంటిదే మరో ఘటనే ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. వావివరసలు మర్చిపోయి కొడుకు వయస్సు యువకుడితో అక్రమ సంబంధాలు పెట్టుకుని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని, డెహ్రాడూన్, వికాస్ నగర్ లోని, జుడ్లి అడువాలా అనే గ్రామంలో భార్యా, ఇద్దరు పిల్లలతో కలిసి కాపురం ఉంటోంది ఒక వివాహితుడి కుటుంబం.

అతని భార్య పద్మ(42)కు అదే ఊళ్లో ఉంటున్న 20 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాలక్రమంలో వారిద్దరి మధ్య శారీరీక సంబంధానికి దారి తీసింది.  అయితే ఈ యువకుడు రోహిత్ ఇంటికి వచ్చివెళుతూ ఉండేవాడు. ఆమె కంటే 22 ఏళ్ళ చిన్నవాడు కావటంతో ఎవరికీ వీరిపై అనుమానం కలగలేదు. ఈ అవకాశాన్ని వారిద్దరూ అనుకూలంగా మలుచుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పద్మ ఆ యువకుడిని ఇంటికి పిలుచుకుని అతడితో రాసలీలల్లో మునిగి తేలిపోయేది. చాలా కాలం పాటు గుట్టుగా వారిద్దరూ శృంగారాన్ని అనుభవించారు. తప్పుడు పనులు ఎక్కువ కాలం దాగి ఉండవన్నట్లు... కొంత కాలానికి వీరి వ్యవహారం భర్త రోహిత్ కు తెలిసిపోయింది.  

పద్ధతిగా నడుచుకోమని భార్యను  రోహిత్ హెచ్చరించాడు. దీంతో భర్తను తొలగించుకోవాలని అనుకుంది. ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. ఏప్రిల్ 4, శనివారం రాత్రి అందరూ ఇంట్లో నిద్రిస్తుండగా పద్మ ప్రియుడిని ఇంటికి పిలిచింది. అందరూ నిద్రలో ఉండగా ప్రియుడు పద్మ ఇంటిలోకి ప్రవేశించి.. రోహిత్ తలపై తుపాకీతో కాల్చి పారిపోయాడు. తెల్లవారి ఏమీ తెలియనట్లు నిద్రలేచి తన భర్తను ఎవరో కాల్చిచంపారని  ఏడ్వటం మొదలెట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలానికి వచ్చి శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రోహిత్ ను తుపాకీతో కాల్చినా.. పక్కగదిలోనే పడుకున్న పద్మకు కనీసం మెలుకవ రాకపోవటం...ఆమెకు తెలియకపోవటంపై పోలీసులకు అనుమానం కలిగింది.

ఇదే అనుమానాన్ని రోహిత్ తండ్రి మెల్హార్ , ఇతర బంధువులు కూడా వ్యక్త పరిచారు. పోలీసులు పద్మను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడు సాయంతో నే భర్తను హత్యే చేసినట్లు నేరం ఒప్పుకుంది.  వెంటనే పోలీసులు నేరం చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పద్మ ప్రియుడు కుడా నేరాన్ని అంగీకరించాడని  హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని నిందితుడు పారెయ్యటంతో దాన్ని వెతికే పనిలో  పోలీసులు ఉన్నట్లు ఎస్పీ దేహత్ పర్మీందర్ దోవల్ చెప్పారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh