lockdown flouters running away seeing police drones లాక్ డౌన్ బ్రేక్.. వాటిని చూసి ఇళ్లలోకి పరుగులు..

Kerala police drone video shows lockdown flouters running away like tracer bullets

Ravi Shastri, lockdown, covid-19, Tracer Bullet Challenge, Kerala police, drone video, viral video, video viral

The state's police force posted to Twitter an edited video which compiled shots of people mostly in the villages running for cover as drones appeared above to check for those who were violating the lockdown over the Covid-19 pandemic.

ITEMVIDEOS: లాక్ డౌన్ బ్రేక్.. వాటిని చూసి ఇళ్లలోకి పరుగులు..

Posted: 04/08/2020 02:31 PM IST
Kerala police drone video shows lockdown flouters running away like tracer bullets

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ జడలు విప్పుతున్న తరుణంలో దాని లింకును తెంచేందుకు కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ విధించింది. కేంద్రం పిలుపుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించి.. ఎక్కడి కక్కడ ప్రజలను కట్టడి చేశాయి. రాష్ట్రంలో జనజీవనాన్ని స్థంబింపజేసింది. చిరు వ్యాపారాలు నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు అన్నింటినీ మూసివేయించింది.

జనసాంద్రత వున్న సినిమా థీయేటర్లులాంటి అన్ని కేంద్రాలను మూసివేయించింది. ప్రజా రవాణ వ్యవస్థను కూడా నిలిపివేయింది. అటు ప్రజలను కూడా తమ ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని పిలుపునిచ్చింది. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని... బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలన్న హెచ్చరికలను పలువురు పట్టించుకోవడం లేదు. ఏమీ పట్టనట్టు ఇష్టానుసారం బయట తిరుగుతున్నారు.

సామాజిక దూరాన్ని కూడా పాటించడం లేదు. వీళ్లకు చెక్ పెట్టేందుకు కేరళ పోలీసులు సరికొత్త ఆయుధాన్ని ప్రయోగించారు. డ్రోన్లతో లాక్ డౌన్ ను ఉల్లంఘించిన వారిని గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి కేరళ పోలీసులు ట్విట్టర్లో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. డ్రోన్లను చూసి జనాలు పరుగులు పెడుతుంటే... బ్యాక్ గ్రౌండ్ లో క్రికెట్ కామెంటరీని యాడ్ చేశారు. బుల్లెట్ లాగా దూసుకుపోతున్నారంటూ రవిశాస్త్రి చెప్పిన కామెంటరీ ఈ వీడియోకు మరింత కామెడీని జోడించింది. వీడియో చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles