Karnataka may allow liquor sale for 3 hours if curbs extended లాక్ డౌన్: మద్యం ప్రియులకు కికెక్కించే వార్త.. ఏంటో తెలుసా..?

Karnataka in no hurry to open liquor stores as excise department exceeds target

coronavirus, covid-19, Lockdown, Liquor sales, Excise Department, Yeddurappa, karnataka, liquor lovers, covid pandemic, corona spread

The Karnataka government is in no hurry to open liquor shops in the state, as the excise department has already managed to exceed its fiscal target by almost Rs500 crore, said two people aware of the matter.

లాక్ డౌన్: మద్యం ప్రియులకు కికెక్కించే వార్త.. ఏంటో తెలుసా..?

Posted: 04/07/2020 08:16 PM IST
Karnataka in no hurry to open liquor stores as excise department exceeds target

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రక్కసి జడలు విప్పుతోంది. ఇప్పటికే 4421 మందిని తన కబంధహస్తాలలో చిక్కకునేట్లు చేసిన ఈ మహమ్మారి ఏకంగా 114 మందిని బలితీసుకుంది. ధీంతో కరోనాను ఎలాగైనా కట్టడి చేయాలన్న కృతనిశ్చయంతో వున్న కేంద్రప్రభుత్వం.. ముందస్తుగా లింక్ ను ఎక్కడికక్కడే తెంచేసేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ను విధించింది. ఈ నెల 14వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మరిన్ని రోజులు లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పోడిగించాలని కేంద్రాన్ని కోరారు.

ప్రజల ఆరోగ్యం రిత్యా ఇప్పటి వరకు 21 రోజుల పాటు విధించిన లాక్ డౌన్ ఫలితాలు మరింత మెరుగ్గా రావాలంటే తప్పక లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పెంచాలని ఆయన కోరారు. అయితే కేసీఆర్ ప్రతిపాదనలపై కేంద్రంలోని పెద్దలుకూడా సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటివరకు ఔషదం లేని ఈ వైరస్ ప్రబలకుండా వుండాలంటే తప్పక మరో రెండు వారాలు లాక్ డౌన్ కోనసాగించాల్సిందేనని కేంద్రంలోని పలువరు పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఈ వార్త దేశంలోని అన్నివర్గాల వారికి కొంత ఇబ్బందులకు గురిచేసేదే అయినా.. ఓ వర్గాన్ని మాత్రం తీరని అందోళన వ్యక్తం చేస్తోంది,

ఆ వర్గమే మద్యంప్రియుల వర్గం. అయితే వీరి గురించి కూడా ప్రభుత్వం అలోచిస్తోందని టాక్. ఇప్పటికే వీరి బాధను చూసి ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నాయట. దీంతో ఏప్రిల్ 14న తరువాత కూడా లాక్ డౌన్ కోనసాగిన పక్షంలో.. రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోందని సమాచారం. మద్యానికి అలవాటు పడిన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకోనుంది. గత నెలలో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి...మద్యానికి బానిసలైన బాబులు మద్యం లభించక పోవడంతో  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఈ పరిస్ధితుల్లో 14వ తేదీ తర్వాత లాక్‌ డౌన్‌ ను పొడిగిస్తే ప్రతీ రోజు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతిపాదించారు. కర్ణాటకలో మార్చి21 నుంచే మద్యం అమ్మకాలు నిషేధించారు. దీంతో మద్యం కోసం వైన్ షాపుల్లో చోరీలు కూడా  జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రానికి  మద్యం అమ్మాకాల ద్వారా రూ. 5000 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడది ఆగిపోయింది. మద్యానికి డిమాండ్ పెరిగిన దృష్ట్యా మూడు గంటలపాటు మద్యం విక్రయించాలని యోచిస్తున్నామని, దీనిపై సీఎం ఎడ్యూరప్ప నిర్ణయం తీసుకుంటారని కర్ణాటక ఎక్సైజ్ శాఖ కమిషనర్ యశ్వంత్ చెప్పారు.

ప్రభుత్వం అన్ని దుకాణాలను తిరిగి ప్రారంభించటానికి అనుమతించాలని లేదా మైసూర్ సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) అవుట్లెట్లను మాత్రమే మద్యం విక్రయించడానికి అనుమతించాలని  కొందరు ఎక్సైజ్  శాఖ అధికారులు సూచిస్తున్నారు. మద్యం కొనుగోలు చేసేటప్పుడు మందు బాబులు సోషల్ డిస్టెన్స్ తప్పని సరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేసినా, కరోనా కేసులున్న ప్రాంతాల్లో మరింత కఠినంగా దిగ్బంధాన్ని కొనసాగించనున్నారు.  అందుకే, తాత్కాలిక ఏర్పాటుగా, మద్యం అమ్మకాలకు మూడు గంటల అనుమతినిచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles