WhatsApp limits Forwards to one chat at a time ఫేక్ న్యూస్ కట్టడికి వాట్సాఫ్ కీలక నిర్ణయం

Whatsapp puts new limits on the forwarding of viral messages

whatsapp, whatsapp forwards, whatsapp forwarded messages, PM Modi, Fake corona news, Coronavirus, Covid-19, India

In a bid to curb misinformation, WhatsApp on Tuesday announced that it has imposed a limit on the forwarding of messages on the app. From today, the messages that have been classified as frequently forwarded messages or sent over five times can now be forwarded to a single chat at a time.

కరోనాపై యుద్దం: ఫేక్ న్యూస్ కట్టడికి వాట్సాఫ్ కీలక నిర్ణయం

Posted: 04/07/2020 07:16 PM IST
Whatsapp puts new limits on the forwarding of viral messages

కరోనా కట్టడిని చేసేందుకు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేసిన కేంద్రం.. ప్రజారోగ్యం ముందు ఎంతటి అర్థిక సంక్లిష్టస్థితులు ఉత్పన్నమైనా కోలుకోవచ్చునని తన చర్యలతో తేల్చిచెప్పింది. అయితే దేశ ప్రజలను ఓ సమస్య మాత్రం తీవ్ర అందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ తో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేని వ్యక్తులు కూడా సామాజిక మాద్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలను చూస్తూ తాము కరోనా బారిన పడ్డామా.? అన్న సందేహాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో టెన్షన్ కు గురవుతున్నారు.

ఈ క్రమంలో కరోనాను నియంత్రించడం కన్నా మందు.. తప్పుడు వార్తలను కట్టడి చేయాలని భావించిన కేంద్రం అటు దిశగా కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచనలు అందుతున్న తురుణంలోనే సామాజిక మాద్యమం వాట్సాప్ ఓ నిర్ణయం తీసుకుంది. అంతర్జాలంలో లభిస్తున్న సమాచారం నిజమైందో కాదో నిర్ధారించుకోలేక ప్రజలు అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో కొవిడ్‌-19కు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తించకుండా ఆపేందుకు వాట్సాప్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వాట్సాఫ్ ద్వారా సందేశాలను ఐదుగురికి పరిమితం చేసిన ఈ యాప్ ఇక మీదట ఈ సంఖ్యను మరింత తక్కువ సంఖ్యకు కుదించింది.

దీంతో ఇకపై వాట్సాప్ ద్వారా షేర్‌ అయ్యే సందేశాలు ఇకమీదట ఒకరికి మాత్రమే పరిమితి చేసింది. ఒక్కసారికి ఒక్కరికి మాత్రమే షేర్‌ చేయగలిగే విధంగా కట్టుదిట్టం చేయడం ద్వారా  మెసేజ్ లను ఫార్వర్డ్‌ చేయడం 25 శాతం మేరకు తగ్గుతుందని ఆ సంస్థ వివరించింది. అంతేకాకుండా తమకు వచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకునే సదుపాయాన్ని కల్పించేందుకు కూడా వాట్సాప్‌ కృషిచేస్తోంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. ఆ మెసేజ్ లపై మాగ్నిఫైయింగ్‌ గ్లాస్‌ బొమ్మ ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్లలో బీటా వెర్షన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సదుపాయం.. త్వరలో అందరికీ అందుబాటులో రానుందని వాట్సాప్‌ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles