Netizens ire on Wanaparthy police over action లాక్ డౌన్ బ్రేక్ చేశాడని పోలీసులు ఓవరాక్షన్.. మంత్రి ఫైర్

Covid 19 ktr serious on wanaparthy police for thrashing man in front of son

Coronavirus In India,coronavirus updates, KTR,Wanaparthy Police,Md Mahamood Ali,TS DGP, DGP M Mahender Reddy, Wanaparthy SP, Apoorva Rao,Telangana, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus in india latest news

A video of police thrashing a man in front of his son in Wanaparthy district headquarters for violating lockdown became viral on social media. Minister K Taraka Rama Rao has asked Home Minister Mahmood Ali and Telangana DGP M Mahender Reddy to take action against the police involved in the incident.

ITEMVIDEOS: లాక్ డౌన్ బ్రేక్ చేశాడని పోలీసులు ఓవరాక్షన్.. మంత్రి ఫైర్

Posted: 04/02/2020 07:42 PM IST
Covid 19 ktr serious on wanaparthy police for thrashing man in front of son

ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో.. కరోనా వైరస్ మహమ్మారిని భారతీయులంతా దృడవిశ్వాసంతో ఎదుర్కోనేందుకు ప్రభుత్వంతో కలసి పోరాడుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించడంతో పాటు పగటి పూట.. మాత్రం బైక్ పై ఒక్కరు మాత్రమే అదీ నిత్యావసర సరుకుుల తీసుకువచ్చేందుకో లేక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పయనించాలని, కార్లలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణించాలని ప్రజలకు సూచించింది.

ఈ నిబంధనను ఉ్లలంఘించారని వనపర్తిలో పోలీసులు ఓ వ్యక్తిని తన కుమారుడి ఎదురుగానే చితకబాదారు. కిందపడేసి కొట్టారు. బాలుడు కొట్టవద్దంటూ దీనంగా అర్థిస్తున్నా.. పట్టించుకోలేదు. ఈ ఘటనను అక్కడే వున్న స్థానికులు తమ మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి.. దానిని నెట్టింట్లో షేర్ చేశారు. ఇది ఆలా అలా.. వెళ్లి ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ అకౌంట్ కు చేరింది. దీంతో ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై సత్వరం చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రిని, డీజీపీని కోరారు.

వివరాల్లోకి వెళితే.. సామాన్యులపై పోలీసుల దురుసు ప్రవర్తనను ప్రశ్నిస్తూ లక్ష్మణ్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. వీడియోను అనుసరించి.. తన కుమారుడితో కలిసి వెళుతున్న ఓ వ్యక్తితో పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కిందపడేసి విచక్షణా రహింతగా దాడి చేశాడు. అక్కడున్న పోలీసులు అతన్ని విడిపించి జీపులో కూర్చోబెట్టారు. అయితే అక్కడే ఉన్న ఆ వ్యక్తి కుమారుడు బెంబేలెత్తిపోయి.. ‘డాడీ వద్దు.. అంకుల్ ప్లీజ్’ అంటూ కన్నీళ్లతో వేడుకోవడం అందరినీ కలచి వేసింది. ఈ వీడియో కేటీఆర్‌ను చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. కొంతమంది ప్రవర్తనతో వేలాదిమంది కష్టం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19 deaths  KTR  Wanaparthy Police  Md Mahamood Ali  TS DGP  Apoorva Rao  Telangana  Crime  

Other Articles