antique silver coins found in farm in vikarabad వికారాబాద్ రైతు పొలంలో వెండి నాణేలు..

Antique silver coins found in farm in vikarabad

Antique silver coins, silver coins unearthed, silver coins farm land, Venkatrami reddy, Elmakannu village, Tandur Mandal, Vikarabad district, Telangana.

Antique silver coins unearthed from a cultivated farm land, while flattering the farm in Elmakannu village of Tandur Mandal in Vikarabad district of Telangana. The farm land owner Venkatrami reddy and the labour belonging to the same village has distributed the coins and maintained secret.

రైతు పొలంలో వెండి నాణేలు.. గు్ట్టుచప్పుడు కాకుండా పంపకాలు

Posted: 04/02/2020 06:46 PM IST
Antique silver coins found in farm in vikarabad

చాలా మంది గుప్త నిధులకోసం తవ్వకాలు చేపడుతూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి వ్యవసాయం సాగు కోసం పొలాన్ని దున్నుతున్నప్పుడు అతనికి నిధి లభ్యం అయింది. ఆ నిదిలో పురాతన కాలం నాటి వెండి నాణేలు ఉండడంతో వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఆ పొలం యజమానితో సహా పోలంలో కూలి పనులు చేసేందుకు వచ్చిన వారు వాటిని పంపకాలు కూడా చేసుకుని ఇంటికి పట్టుకెళ్లారు. ఈ విషయాన్ని ఎంత గోప్యంగా వుంచాలని ప్రయత్నాలు చేసినా.. మనిషి నోట్లో నిజం.. పది మందిలో రహస్యం దాగవన్నది జగమెరిగిన సత్యం.

ఈ విషయం ఆ నోటా, ఈనోటా ఊరందరికీ తెలిసింది. ఇక ప్రత్యేర్థులకు కొదవలేని సమాజంలో వారి సాయంతోనే విషయం ప్రభుత్వ అధికారులకు తెలిసింది. ఇంకేముందీ రంగంలోకి దిగిన అధికారులు పురాతన వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకెళ్తే తాండూరు మండలంలోని ఎల్మకన్నె గ్రామానికి చెందిన సహకార సంఘం డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి అతని పొలాన్ని సోమవారం ఉదయం దున్నుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి పొలంలో వెండి నాణేలు బయటపడ్డాయి.

ఈ విషయాన్ని గమనించిన వెంకట్రామిరెడ్డి తన పొలంలో ఉన్న మరికొందరు ఆ నాణేలను గుట్టుగా పంచుకుని ఎక్కడి వారు అక్కడికి వెల్లిపోయారు. అయితే ఈ విషయం గ్రామంలోని కొంత మందికి తెలవడంతో ఆ నోటా ఈ నోటా అది కాస్త రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం చేరింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నాణేలు బయటపడిన విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఇంకేముంది వెంకట్రామిరెడ్డి నుంచి, ఇతరుల నుంచి మొత్తం 141 వెండి నాణేలను స్వాధీనం చేసుకుని వెల్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh