21 new covid-19 cases in Andhra Pradesh ఏపీలో 132కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

21 markaz attendees test positive in andhra cases rise to 132

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

The number of COVID-19 positive cases in Andhra Pradesh rose from 111 to 132 overnight as 21 more cases were reported on Thursday morning. All the 21 positive cases since last night are linked to the Tablighi Jamaat meet in Delhi’s Markaz Nizamuddin,

ఏపీపై కమ్ముకుంటున్న కరోనా మేఘాలు.. 132కు చేరిన పాజిటివ్ కేసులు

Posted: 04/02/2020 08:52 PM IST
21 markaz attendees test positive in andhra cases rise to 132

ఇండియాలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి నేటికి సరిగ్గా రెండు నెలలు. ఫిబ్రవరి 1న తొలి కేసు నమోదైంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మార్చి 22 నాటికి కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ధైర్యంగా వున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రంలో విజృంభిస్తోన్న వైరస్ మహమ్మారిని చూసి అందోళన చెందుతోంది. అయితే ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ మసీదులోని తబ్తిగి జమాత్ కు వెళ్లివచ్చిన వారితో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల వివరాలను వెల్లడిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 20 చొప్పున, ప్రకాశం జిల్లాలో 17, కడప, కృష్ణా జిల్లాల్లో 15 చొప్పున , పశ్చిమగోదావరి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 9 అనంతపురంజిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1800 మంది నమూనాలు పరీక్షించగా.. 1175 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. 493 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

మంగళగిరిలోని టిప్పర్ల బజార్లో ఓ వ్యక్తి(65)కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అతని నివాసం నుంచి 3కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. కరోనా పాజిటివ్‌ కేసుతో సమీపంలోని దుకాణాలు, కూరగాయల మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ఆ ప్రాంతమంతా హైఅలర్ట్‌ ప్రకటించామని కమిషనర్‌ వెల్లడించారు. దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే, విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ వీరిలో ఉన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles