Three more Covid-19 deaths in Telangana తెలంగాణలో మరో మూడు కరోనా మరణాలు..

Three more covid 19 deaths in telangana toll raise to 11

coronavirus,coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana,' Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

Telangana witnessed a massive jump in COVID-19 count as 121 fresh cases were reported since last night. At present, there are over 300 confirmed cases and 11 deaths, including the three who died today.

తెలంగాణలో మరో మూడు కరోనా మరణాలు.. 11కు చేరిన మృత్యుల సంఖ్య

Posted: 04/02/2020 10:54 AM IST
Three more covid 19 deaths in telangana toll raise to 11

తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య పదకొండుకు చేరింది. కొత్తగా 30 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 127కు చేరుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ గత రాత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. ‘గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు కరోనా వైరస్‌ కారణంగా మరణించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి, వారి వల్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కొత్తగా వైరస్‌ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింద’ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారే’నని వివరించారు. ‘సోమవారం మరణించిన ఆరుగురిలో అయిదుగురు మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరికొంత మందికి వైరస్‌ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్ఛార్జి కూడా అయ్యారు. ఎవరి పరిస్థితీ ఆందోళనకరంగా లేదు. ఈ నేపథ్యంలో మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మరో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది’ అని వెల్లడించారు.

ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్నవారు.. ఇంకా వీరితో కలిసామని భావించే వారు ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. పరీక్షల అనంతరం ఎవరికైనా వైరస్‌ సోకినట్లు తేలినా, వారి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్‌ కిట్స్‌ కూడా సిద్ధంగా ఉంచామని సీఎం వెల్లడించారు.

ఇదిలావుండగా, ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ఆధ్వర్యంలో నిర్వహించిన తబ్లీగి జమాత్ కార్యక్రమానికి తెలంగాణ నుంచి హాజరైన వారిలో మరో 160 మంది వివరాలు ఇప్పటికీ లభ్యం కాలేదు. ఇప్పటివరకు దాదాపు 500 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి సంబంధీకుల్లో పలువురిని వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. చార్మినార్‌ వద్ద నిజామియా ఆసుపత్రిలో 80 మందిని, అమీర్ పేటలోని ప్రకృతి వైద్యశాలలో 200 మందిని, మెహిదీపట్నంలోని సరోజినీదేవి ఆసుపత్రిలో 110 మందిని ఉంచారు. కాగా, ఢిల్లీ వెళ్లి వచ్చిన 1030 మందిలో 160 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడం ఆందోళనకరంగా మారింది. వీరి ద్వారా సుమారు రెండు వేల మందికి పైగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles