Sri Rama Navami celebrations at Tirumala భక్తజనకోటికి దూరంగా సీతారాముల వారి జగత్కళ్యాణం..

Sri rama navami celebrated in a simple manner at badrachalam

Sri Rama Navami, Lord Sri Rama, Tirumala, Badrachalam, Indrakaran Reddy, pattu vastralu, muthyala talambralu, Andhra Pradesh, Telangana

Sri Sitarama Kalyanam is performed in a most simple way at a well-known and historical Sri Sitarama Swamy temple at Badrachalam on Thursday. Due to Corona infection the state government has instructed all the temples to organize the Kalyanam in a simple as possible manner.

భక్తజనకోటికి దూరంగా సీతారాముల వారి జగత్కళ్యాణం..

Posted: 04/02/2020 01:04 PM IST
Sri rama navami celebrated in a simple manner at badrachalam

కరోనా రక్కసి దేశంలోకి, తెలుగు రాష్ట్రాల్లోకి జొరబడకుండా ఉండి వుంటే ఇవాళ జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా.. భక్తుల కన్నులపండువగా సాగివు ఉండేవి. వాడవాడనా ఉండే రామాలయాలు భక్తులతో కిటకిటలాడేవి. వేకుడ జామునుంచే దేశవ్యాప్తంగా రామాలయాల్లో శ్రీరామ నామస్మరణ మార్మోగేది. అన్ని దేవాలయాల్లో శ్రీసితారాముల జగత్కళ్యాణం జరిగేంది. అనంతరం వడపప్పు, పానకాలతో పాటు పలు దేవాలయాల్లో మధ్యాహ్నం అన్న ప్రసాదాల వితరణతో సందడిగా మారేవుండేది. కానీ ఈ మహమ్మారి కారణంగా.. ఎటువంటి ఆర్భాటాలు, సందడి లేకుండానే శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

అలాగే కలియుగ వైకుంఠంగా ప్రతీతి చెందిన తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం సీతారామ లక్ష్మణులకు తిరుమంజనం నిర్వహించారు. నిత్యం భక్తజన సందోహం మధ్య సాగే ఈ వేడుకలకు ఈ సారి భక్తుల లేక కేవలం అర్చక బృందం మాత్రమే కదిలిరాగా ఈ సేవా కార్యక్రమాలు జరిగాయి. ఇకరాత్రి 10 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థాన వేడుక నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. రేపు రాత్రి 8 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. వైరస్ కలవరపెడుతుండడంతో ఈ వేడుకలన్నీ ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణమహోత్సవం కన్నులపండువగా జరిగింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో భక్తులకు ప్రవేశం లేకుండా కోవెల ప్రాంగణంలో నిరాడంబరంగా ఈ వేడుకను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆలయ అర్చకులకు అందజేశారు. సుమారు 40 మంది సమక్షంలోనే జగత్కల్యాణాన్ని నిర్వహించారు. భక్తజనకోటి మధ్య జరగాల్సిన కార్యక్రమాలను ఇలా జరపించే విప్కతర పరిస్థితులు కల్పించావేమిటి రామా.? అంటూ అటు ఆర్చకులు, ఇటు భక్తులు.. శ్రీరామరక్ష సర్వజగధ్రక్ష అంటూ భారమంతా శ్రీరాములవారిపైనే వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles