1000 people from Telangana to have attended Markaz మత ప్రార్థనలకు వెళ్లినవారితో అప్రమత్తం..

1 000 people from telangana estimated to have attended markaz prayers officials

coronavirus in india, coronavirus, covid-19, Lockdown, New Delhi, Markaj, nizamuddin, religious events, coronavirus in Telangana, Hyderabad, Telangana, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Telangana administration is estimating that over 1,000 people from the state might have attended a religious congregation in the national capital''s Nizamuddin area earlier this month, a senior official said adding the search is on to identify people who came in contact with them.

మత ప్రార్థనలకు వెళ్లినవారితో అప్రమత్తం.. హైఅలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

Posted: 03/31/2020 12:06 PM IST
1 000 people from telangana estimated to have attended markaz prayers officials

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో వ్యాధి ఏప్రిల్ 7 నాటికి తెలంగాణ నుంచి కనిపించకుండా పోతుందని ప్రభుత్వం వేసిన అంచానాలను తలకిందులు చేశాయి ఆ మరణాలు. నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ లో జరిగిన మతప్రభోదక కార్యక్రమాలకు హాజరైన వారే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా పరిణమించారు. ఎంతటి చర్యలు తీసుకున్నా.. కరోనా వైరస్ బారిన పడిన వీరు గత పక్షం రోజులు ఎక్కడెక్కడ తిరిగారు.. అసలు ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు వెళ్లిన వారు ఎంత మంది అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు.. ఇటు తెలంగాణ, అటు అంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా మారింది.  పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడానికి ఇదే కారణం అన్న అభిప్రాయాలు వ్యక్తమువుతున్నాయి. మర్కజ్ మసీదులో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది పాల్గొని.. రాష్ట్రానికి తిరిగివచ్చారు. వీరిలో చాలామందికి కరోనా సోకింది. కరోనా వైరస్ సోకడంతో కొందరు చనిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను, ప్రజలను బెంబేలెత్తిస్తోంది.

తెలంగాణలో ఏకంగా ఆరుగురు కరోనాతో చనిపోవడంతో వెలుగుచూసిన మర్కజ్ మసీదు ప్రార్థనల అంశంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ ప్రార్థనలను ఎంతమంది వెళ్లారన్న విషయాలపై అరా తీయగా తీవ్ర కలవరం చెందే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈనెల 13 నంచి 15 తేదీల మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ లో నిర్వహించిన ప్రార్థనల్లో దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్, ఇరాన్, ఉజ్ బెకిస్తాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 1500 నుంచి రెండు వేల మంది వరకు పాల్గోన్నట్లుగా సమాచారం,

ఏపీ, తెలంగాణలో ‘కరోనా పాజిటివ్‌’గా తేలిన వారిలో చాలామంది ఢిల్లీలో జరిగిన సదరు మత సదస్సుకు హాజరైన వారే. ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రార్థనా మందిరంలో రెండున్నర రోజులపాటు ఒక సదస్సు జరిగింది. వీరిలో అత్యధికులు ఈనెల 14-15వ తేదీల్లో తమ ప్రాంతాల నుంచి రైళ్ల వెళ్లారు. 16, 17, 18వ తేదీ మధ్యాహ్నం వరకు జరిగిన సదస్సులో పాల్గొన్నారు. 15 నుంచి 20 మందితో కూడిన బృందాలుగా వెళ్లిన వారంతా కలిసే ప్రయాణించారు. ఢిల్లీలో ఉన్నన్ని రోజులు కలిసే బస చేశారు. ఆ తర్వాత రైళ్లలో బృందాలుగా వచ్చారు. ఏపీకి చెందిన వారు దురంతో ఎక్స్‌ప్రెస్‌, ఏపీ ఎక్స్‌ప్రెస్ లలో ప్రయాణించారు. ఇదే ఇప్పుడు ప్రభుత్వాలకు కంటిమీద కునుకును కరవయ్యేలా చేస్తోంది.

దేశంలో కరోనా వైరస్ స్టేట్ 2లో వుండగానే ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక వైరస్ వ్యాప్తిని నియంత్రివచ్చునని, దేశ అర్థిక స్థితిగతలు అద్వానంగా తయారైనా.. ప్రజల అరోగ్యానికి పెద్దపీట వేసి చర్యలు చేపట్టిన తరుణంలో ఇక వైరస్ అంతం ఖాయమని భావిస్తున్న తరుణంలో మర్కజ్ మసీదులో మత్రప్రబోదక సమావేశాలు వైరస్ మహమ్మారిని వ్యాప్తిచేసేందుకు దోహదపడ్డాయన్న భావనతో అటు ప్రభుత్వాలతో పాటు ఇటు ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఇక ఇప్పటికే దశ మార్చుకున్న వైరస్ స్టేట్ రెండు దాటి వ్యవహరిస్తోందన్న వార్తులు వినబడుతున్నాయి. విదేశీ నేపథ్య నుంచి ఇక లోకల్‌ కాంటాక్టు వల్లే కరోనా పాజిటివ్ కేసులు రావడం తీవ్ర అందోళన రేకెత్తిస్తోంది.

వారం రోజులుగా నమోదవుతున్న కేసుల్లో, విదేశాల నుంచి వచ్చిన వాళ్లవి 30 శాతం మాత్రమే ఉంటుండగా, లోకల్‌ కాంటాక్టు ద్వారా 70 శాతం కేసులు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా.. ఢిల్లీలో ప్రార్థనా మందిరంలో మతపరమైన కార్యక్రమాలకు వెళ్లి వచ్చిన వారి వల్లే ఎక్కువ కేసులు నమోదవుతుండడం ఆందోళనకరం. రాజధాని హైదరాబాద్‌ నుంచి దాదాపు 300మంది వెళ్లినట్లు సమాచారం. వారిలో 150 మంది వివరాలు సేకరించారు. ఖైరతాబాద్‌ నుంచి ఇలా వెళ్లిన ఒకరు.. తీవ్ర అస్వస్థతతో మృతి చెందారు. ఆయన చనిపోయాక పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్లు తేలింది. కుత్బుల్లాపూర్ కు చెందిన మరో వ్యక్తికి కూడా ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లొచ్చాక వైరస్‌ సోకిన లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేస్తే పాజిటివ్‌ వచ్చింది. అతడి నుంచి కుటుంబసభ్యుల్లో నలుగురికి వైరస్‌ సోకింది. దీంతో వైద్యశాఖ అధికారులు ఢిల్లీ ప్రార్థనా మందిరం నిర్వాహకులను సంప్రదించి.. ఆ కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించారు.

తెలంగాణ నుంచి ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొన్నవారు, జిల్లాల వారీగా:
హైదరాబాద్ : 186
మెదక్ - 26
మహబూబ్ నగర్ - 25
వరంగల్ - 25
నల్గొండ - 21
నిజామాబాద్ - 18
ఖమ్మం - 15
ఆదిలాబాద్ - 10
రంగారెడ్డి - 15
కరీంగనర్ - 17
భైంసా - 11
నిర్మల్ - 11  అయితే అనధికారికంగా ఈ సంఖ్య 1000 నుంచి 1200 వరకు ఉందని సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles