Coronavirus: Telangana announces big salary cuts కరోనావైరస్ లాక్ డౌన్: ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో భారీ కోత

Coronavirus lockdown telangana govt announces up to 75 pay cut for its officials

covid-19, coronavirus, coronavirus in india, coronavirus, covid-19, Lockdown, telangana covid 19, Hyderabad, Telangana, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news, politics

In the wake of a financial crisis due to the coronavirus pandemic which has affected over 1,000 people in India, the state government decided to cut salaries of the government employees and officials.

కరోనావైరస్ లాక్ డౌన్: ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో భారీ కోత

Posted: 03/31/2020 01:39 PM IST
Coronavirus lockdown telangana govt announces up to 75 pay cut for its officials

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు ఫలితాలను ఇచ్చే క్రమంలో నిజాముద్దీన్ మసీదు మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే ఇప్పుడు ప్రభుత్వాలకు శరాఘతంలా పరిణమించారు. వీరిలో ఆరుగురు మృత్యువాతపడటంతో అసలు విపత్తు పోంచివుందిని గ్రహించిన ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని అదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వీరు ఎక్కడెక్కడికి వెళ్లారు.. వచ్చిన తరువాత వెళ్లిన ప్రాంతాలు.. ఇతరాత్ర సమాచారాన్ని రాజబ్టేపనిలో వైద్యాధికారులతో పాటు జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో అధికారుల వేతనాల్లో కొత విధించింది ప్రభుత్వం. మార్చి నెల నుంచే కోత వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం వేతనంపై కోత విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుదపరి ఉత్తర్వులు వచ్చే వరకు కోత అమల్లో ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన అనంతరం దీనికి ఆమోదం తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోతలు మినహాయించిన తరువాత మిగిలిన వేతనాలను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.

* సీఎం, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత
* ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ లాంటి అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లో 60 శాతం కోత.
* మిగతా అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత
* నాలుగో తరగతి, ఒప్పంద(కాంట్రాక్టు), పొరుగు సేవల (ఔట్‌ సోర్సింగ్‌) ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత
* అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో 50 శాతం కోత
* నాలుగో తరగతి విశ్రాంత ఉద్యోగుల పింఛనులో 10 శాతం కోత విధిస్తారు.

 తెలంగాణలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులున్నారు. ఇందులో ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు 4,30,674 మంది. 2.5 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు జీతభత్యాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,500 కోట్ల మేరకు వెచ్చిస్తోంది. తాజా కోత వల్ల ప్రభుత్వానికి రూ.1,700 కోట్ల మేర ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. కరోనా నివారణ చర్యల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము సహకరిస్తామని పీఆర్‌టీయూ టీఎస్‌ తెలిపింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులకు అశనిపాతమని.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్ల, ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఐక్య వేదిక ఖండించింది. పునరాలోచించాలని డిమాండ్‌ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  lockdown  CM  MLCs  MLAs  IAS  IPS  IFS  employees  class IV  outsourcing and contract employees  salary cut  Telangana  

Other Articles