Excise CI suspended after caught transporting liquor illegally ఏపీలో డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు

Andhra pradesh sees 17 new coronavirus cases total tally up to 40

coronavirus in india, coronavirus, covid-19, Lockdown, New Delhi, Markaj, nizamuddin, religious events, coronavirus in Andhra Pradesh, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Andhra Pradesh is on high alert, as 17 new coronavirus (Covid-19) positive cases pushed up the total number of cases in the state to 40. According to a bulletin released on Tuesday, 17 new Covid-19 positive cases have been reported since 9 PM last night, even as 4 patients recovered.

కరోనావైరస్: ఏపీలో డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు

Posted: 03/31/2020 10:03 AM IST
Andhra pradesh sees 17 new coronavirus cases total tally up to 40

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న క్రమంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ప్యూతో పాటు రాష్ట్రం మొత్తం లాక్ డౌన విధించిన విషయం తెలిసిందే. కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో భయాందోలనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి పెరిగింది. ఈ ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇవాళ తాజా ప్రకటన విడుదల చేసింది. బాధితుల్లో ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీరి నుంచి తాజాగా పదేళ్ల బాలుడికి కరోనా సోకినట్టు తేలడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన బాలుడి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్నటి వరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 23. ఆ సంఖ్య కాస్త ఒక్కసారిగా 40కి పెరగడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసే యోచనలో ఉంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

* అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన పదేళ్ల బాలుడికి కరోనా
* మక్కా నుంచి వచ్చిన కర్నాటక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న బాలుడు
* అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన 34 ఏళ్ల మహిలకు కరోనా
* మక్కా నుంచి వచ్చిన కర్నాటక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మహిళ
* ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 కరోనా కేసులు
* గుంటూరు జిల్లాలో 9కి చేరిన కరోనా కేసులు
* విశాఖ జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5కి చేరిన కరోనా కేసులు
* తూర్పుగోదావరి జిల్లాలో 4 కేసులు
* చిత్తూరు, కర్నూలు, నెల్లూరులో ఒక్కో కేసు నమోదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles