Man with amnesia suddenly remembers his home ‘‘కరోనా వైరస్ భయానక మరణాలతో గతం గుర్తుకోచ్చింది’’

Man with amnesia suddenly remembers his home while watching coronavirus news

Amnesia, Chinese, Coronavirus, Recovery, migrant worker, Zhu Jiaming, Guizhou Province, south-western China, memory loss, memory recovery, miracle

A Chinese migrant worker who lost his memory in 1990 due to brain injuries recently remembered his hometown while watching a news report about the coronavirus outbreak. Thirty years ago, Zhu Jiaming, a young man from Guizhou Province in south-western China, left his home to work construction in the central province of Hubei.

‘‘కరోనా వైరస్ భయానక మరణాలతో గతం గుర్తుకోచ్చింది’’

Posted: 03/21/2020 01:24 PM IST
Man with amnesia suddenly remembers his home while watching coronavirus news

కరోనా ధాటికి ప్రపంచ అగ్రదేశాలు సైతం భీతిల్లిపోతన్నాయంటే అతిశయోక్తికాదు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను ఇప్పటికే కబళించిన ఈ వైరస్.. తన కబంధహస్తాలలో ఏకంగా లక్షలాధి మందిని ఇబ్బందికి గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఇంతటి పెను ఉపద్రవం వల్ల యావత్ ప్రపంచానికి కీడు జరిగినా.. ఒక్కరికి మాత్రం లాభం జరిగింది. ఆ వ్యక్తి మర్చిపోయిన గతాన్ని కరోనా వైరస్ గుర్తుకు తీసుకువచ్చింది. ఇప్పుడా వ్యక్తి మూడు దశాబ్దాల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోబోతున్నాడు. వివరాల్లోకెళితే...

చైనాలోని గియిజు ప్రావిన్స్ కు చెందిన 57 ఏళ్ల జు జియామింగ్ ఓ కార్మికుడు. 90వ దశకం ఆరంభంలో ఉపాధి కోసం మరో ప్రాంతానికి వలసవెళ్లాడు. అయితే పనిచేస్తుండగా ఓ ప్రమాదంలో గాయపడి జ్ఞాపకశక్తి కోల్పోయాడు. దీంతో అతను ఎవరో ఏమిటో అన్న విషయం తెలుసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అతడి వద్ద ఐడెంటిటీ కార్డు కూడా లేకపోవడంతో అతడి వివరాలను అధికారులు గుర్తించలేకపోయారు. అయితే అతని తల్లి మాత్రం తన కొడుకు అదృశ్యమయ్యాడని అమె తన స్వగ్రామంలో అతని తల్లి మిస్సింగ్ కేసు పెట్టింది.

అయితే జియామింగ్ ఆచూకీ లభ్యంకాకపోవడంతో అక్కడి పోలీసులు కేసును మూసివేశారు. అతను బతికేవున్నా.. అధికారికంగా చనిపోయాడని అధికారులు తేల్చేశారు.. ఇలాంటి పరిస్థితుల్లో జియామింగ్ ను ఓ జంట చేరదీసింది. తమ కుటుంబసభ్యుడిగా భావించి ఆదరించింది. జియామింగ్ తన స్వగ్రామం గురించి, తన కుటుంబసభ్యుల గురించి ఎంత జ్ఞాపకం చేసుకున్నా ఒక్క విషయం కూడా గుర్తుకు రాక ఎంతో బాధపడేవాడు. అయితే ఇటీవల కరోనాకు సంబంధించిన వార్తలు జియామింగ్ చెవినబడ్డాయి.

ఆ వార్తల్లో అతడి స్వగ్రామం చిషు పేరు కూడా వినిపించింది. చిషు గ్రామంలో కూడా కరోనా మరణం సంభవించిందన్న వార్త వినడంతో జియామింగ్ లో జ్ఞాపకాలు పురివిప్పాయి. తన సొంత ఊరు గుర్తుకు రావడమే కాదు అయినవాళ్లందరూ కళ్లముందు మెదిలారు. వెంటనే పోలీసులను కలిసి తన పరిస్థితి వివరించాడు. పోలీసులు జియామింగ్ కథ విని వెంటనే చర్యలు తీసుకున్నారు. వీడియో కాల్ ద్వారా అతడి తల్లితో మాట్లాడించారు. త్వరలోనే కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles