కరోనా వైరస్ వ్యాప్తితో తిరుమలలో టీటీడీ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకుని వెంకన్న దర్శనానికి భక్తుల రానీయకుండా చర్యలు చేపట్టింది. తిరుమల శ్రీవారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరుమలకు చేరుకునే ఘాట్ రోడ్డుతో పాటు రెండు మెట్ల మార్గాలను కూడా అధికారులు మూసివేయించడంతో కొంతపై కరోనా వ్యాధి ప్రబలకుండా తక్షణ చర్యలు చేపట్టారు. తిరుమలలో కరోనా అనుమానిత వ్యక్తిని గుర్తించిన అధికారులు.. తీవ్ర అస్వస్థతకు గురైన సదరు భక్తడిని తిరుపతిలోని రుయా అసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి శుభవార్తను అందించింది తిరుమల పాలకమండలి. ఉగాది కానుకగా ఈ నెల 25వ తేదీన శ్రీవారి లడ్డూలు ప్రతి కుటుంబానికి ఉచితంగా అందించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల శ్రీవారి లడ్డూకు ఉన్న డిమాండ్ అంతా ఇంతాకాదు. స్వామి దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు. దీనికి అదనంగా ఎన్నయినా కొనుక్కునే అవకాశం ఉంది. భక్తుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం నిత్యం లక్షల్లో లడ్డూలు తయారు చేసి నిల్వ ఉంచుతుంది.
కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల రాకను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందే దాదాపు రెండు లక్షల లడ్డూలను దేవస్థానం సిద్ధం చేసి ఉంచింది. తిరిగి ఆలయంలోకి భక్తుల ప్రవేశం ఎప్పుడన్నది కచ్చితంగా తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉన్న నిల్వలను సిబ్బందికైనా పంచిపెడితే వారు సంతోషిస్తారని దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉగాది కానుకగా ఈ లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది అందుకోనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more