MP political crisis: Digvijay Singh arrested సుప్రీంలో బీజేపికి ఎదురుదెబ్బ.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అరెస్ట్

Madhya pradesh crisis top court says rebel mlas can t be held captive

Digvijay Singh, Congress MLAs, Madhya Pradesh Government, Madhya Pradesh Crisis, MP Floor Test, Supreme Court, Madhya Pradesh Crisis Updates

The Supreme Court, while hearing the petition filed by BJP leaders for an immediate floor test, refused to accept the proposal for producing 16 rebel MLAs in judges' chamber. The court further said that the rebel MLAs may or may not go to the Assembly but they cannot be held captive.

సుప్రీంలో బీజేపికి ఎదురుదెబ్బ.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అరెస్ట్

Posted: 03/18/2020 01:55 PM IST
Madhya pradesh crisis top court says rebel mlas can t be held captive

ధేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బిజేపి పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకునేలా అదేశాలను జారీ చేయాలని బీజేపి నేతలు దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం.. ఎమ్మెల్యేలను పార్టీ అదుపులోకి తీసుకుందన్ని అరోపణలపై స్పందిస్తూ వారిని వదిలిపెట్టాలని అదేశించింది. ఎమ్మెల్యేలు చట్టసభలకు హాజరవుతారా.? లేదా.? అన్న విషయం వారి ఇష్టానికే వదిలేసిన న్యాయస్థానం.. వారు ఎక్కడో బెంగళూరులోని హోటల్ లో ఎందుకు వున్నారని నిలదీసింది. ఇదే సమయంలో తమ ముందు ఎమ్మెల్యేలను హాజరపరుస్తామన్న వినతిని కూడా న్యాయస్థానం తోసిపుచచింది. ఇది సముచితం కాదని పేర్కోంది.

మధ్యప్రదేశ్ లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోనే ఉంచాలన్న ఆకాంక్షతో, రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు మధ్యప్రదేశ్ నుంచి నేరుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి, అమృతహల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నగరంలోని రమడా హోటల్ లో క్యాంప్ వేసిన 21 మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లిన దిగ్విజయ్ ని హోటల్ సమీపంలో పోలీసులు అడ్డుకోగా, ఆయన రోడ్డుపైనే బైఠాయించారు.

అంతకుముందు బెంగళూరుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ స్వాగతం పలికారు. ఆపై వారిద్దరూ కలిసి హోటల్ వద్దకు వెళ్లగా, ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం దిగ్విజయ్ మాట్లాడుతూ, తాను ఎంపీనని, 26న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేస్తే, వారితో మాట్లాడాలని తాను వచ్చానని, కానీ పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. వాళ్లు వెనక్కు తిరిగి వస్తారనే తాను భావిస్తున్నానని, తమ ఎమ్మెల్యేలను ఇక్కడ బలవంతంగా నిర్బంధించారని ఆరోపించారు.

మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఆపై ఆయన ఇతర నేతలతో కలిసి రోడ్డుపైనే టీ తాగారు. కాగా, తన వర్గం ఎమ్మెల్యేలతో సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేయగా, ప్రభుత్వం మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి వుండగా, కరోనా ఎఫెక్ట్ తో కమల్ నాథ్ సర్కారు తాత్కాలికంగా బయటపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles