disha-2 crime: Shocking revealation in woman murder case చేవెళ్ల వివాహిత హత్యకేసులో షాకింగ్ విషయాలు

Disha 2 crime shocking revealation in woman murder case after preliminary autospy

CM KCR, Disha, vetarinary doctor, Disha Incident, married women murder, Rape, preliminary autopsy report, Disha Rape and Murder, Thangadapalli, DSP Ravindra Reddy, CCTV footage, Chevella, Rangareddy, Telangana Police Telangana, Politics

Three months after the sensational Disha episode, A similar crime took place in Ranagareddy near a bridge at Thangadapalli of Chevvella mandal, the police reveals preliminary repots say she is married and brutally hanged somewhere and bought here and hit her head with rock

దిశ 2 ఘటన: ఉరి బిగించి వివాహిత హత్య.. మరిన్ని షాకింగ్ విషయాలు

Posted: 03/18/2020 01:01 PM IST
Disha 2 crime shocking revealation in woman murder case after preliminary autospy

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో పోలీసుల పలు ప్రశ్నలకు సమాధానాలు లభించాయని తెలుస్తోంది. నివేదికతో వెలుగుచూసిన పలు విషయాలను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. మృతురాలు తెలంగాణ వాసి కాదని బహుశా మహారాష్ట్ర లేదా గుజరాత్ కు చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మెడకు ఉరి వేసి, అనంతరం బండరాయితో మోది హత్య చేసినట్లు వైద్యులు గుర్తించారు. అలాగే మహిళ గొంతు నులిమినట్లు ఆనవాళ్లు గుర్తించారు.

ఈ కేసులో మృతురాలి ఆభరణాలు కీలక ఆధారాలుగా మారాయి. వాటి సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తనమూనాలు, విశ్రా శాంపిల్స్ ఉస్మానియా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిచారు. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలు వివాహితగా వైద్యులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం, ఆర్థిక గొడవలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. దిశ -2 క్రైమ్ ను సవాలుగా తీసుకున్న పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఒంటిపై బంగారు ఆభరణాలు, మరోవైపు పోలీసుల కోణంలో జరుపుతున్న దర్యాప్తులో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఈ కేసులో నాలుగు వాహనాలు అనుమానంగా ఉన్నాయి. వాహనాలకు సంబంధించిన అడ్రస్ లను కూడా ట్రేస్ అవుట్ చేసినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు..వారి అభిప్రాయం కూడా పోలీసులకు వెల్లడించారు. తొలుత మహిళను హతమార్చిన తర్వాత వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి కల్వర్టు కింత పడేసి అక్కడ తలపై మోదడంతో తల నుజ్జునుజ్జు కావడంతో స్పాట్ లోనే చనిపోచయినట్లు తెలుస్తోంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళ వివాహిత, ఆమెకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లను సేకరించారు. దీనికి సంబంధించి ప్రైమరీ రిపోర్టు పోలీసులకు అందించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కొన్ని విషయాలను పోలీసులకు వెల్లడించారు.

మహిళలకు స్పోకింగ్ అలవాటు ఉంటుందన్న విషయాన్ని వైద్యుల నివేదిక ద్వారా తెలుసుకన్న పోలీసులు అమె చిరునామాను తెలుసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసులో చనిపోయిన మహిళ ఎవరు.? హత్య చేసింది ఎవరు.? ఒక్కరి ప్రమేయంతోనే జరిగిందా.? లేక మరెవరి హస్తమైనా వుందా.? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతుంది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు కూడా ఈ కేసులో కీలకం కానున్నాయి. సీసీ కెమెరాలు కూడా కీలకంగా మారాయి. తంగెడ్ పల్లి గ్రామంలో రోడ్డు కల్వర్టు వికారాబాద్ నుంచి సంగారెడ్డి మార్గంమధ్యలో జరిగింది కాబట్టి ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh