special homas to get rid of coronavirus దేశంపై కాలసర్ప దోషం ప్రభావం.. విశాఖ పీఠం ప్రత్యేక హోమం

Visakha peetham begins special homas to get rid of coronavirus

coronavirus in india, coronavirus, covid-19, astrology, rahuvu, guruvu, sarada peetham, swatmanandendraswamy, swaroopanandendra swamy, visakhapatnam, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Visakhapatnam sarada peetham begins special homas from today and to perform yagas to prevent kala sarpa dosham impact on india from april 2nd to April 10th in the presedence of peetam head swami swaroopanandendra swamy.

దేశంపై కాలసర్ప దోషం ప్రభావం.. విశాఖ పీఠం ప్రత్యేక హోమం

Posted: 03/18/2020 03:31 PM IST
Visakha peetham begins special homas to get rid of coronavirus

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ పై ఎలాంటి ప్రచారం చేయకూడదని ఇటు ప్రభుత్వాలు, అటు పోలీసులు హెచ్చరిస్తున్నా.. రోజురోజుకూ పలు సత్యాసత్య ప్రచారాలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతూనే వున్నాయి. దీంతో పాటు పలువురు ఈ సూచనలను తీసుకుంటే కరోనా రాదని, ఈ యోగాసనాలు చేస్తే వ్యాధి బారిన పడకుండా వుండవచ్చని సూచనలు ఇస్తూనే వున్నారు. ప్రస్తుతం ఇలాంటిదే ఓ వార్త దేశంలో విపరీతంగా వైరల్ అవుతోంది. అదే దేశానికి కాలసర్ప దోషం పట్టిందని, దీంతో ఆ తొమ్మిది రోజులు అత్యంత కీలకమని కూడా హెచ్చరికలు వస్తున్నాయి.

ఈ వార్తను హేతువాదులు తోసిపుచ్చుతున్నా.. దేశంలో మెజారిటీగా వున్న హిందువులు మాత్రం జ్యోతిష్య విశాసాలపై నమ్మకాలు కలిగినవారు కావడంతో ఈ వార్తను అంత తేలిగ్గా కొట్టిపారేలేమని, ఇది కూడా నిజం కావచ్చును కదా అని వాదిస్తున్నారు. ఇంతకీ ఆ తొమ్మిది రోజులు ఏంటీ అంటే.. వచ్చే నెల అనగా ఏప్రిల్ నెల రెండో తేదీ నుంచి మే 10 వరకు  దేశానికి కాలసర్పదోషం ఉంటుందన్న వార్త ప్రస్తుతం అలజడి సృష్టిస్తోంది. ఈ మేరకు విశాఖ శ్రీ  శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. పాప గ్రహాల శక్తి పుంజుకోవడంతో పాటు రాహువు దృష్టి గ్రహాల మీద పడిందని ఆయన తెలిపారు.

ఈ తరుణంలోనే పాపగ్రహాల శక్తి కారణంగా దేశంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని ఆయన అన్నారు. ఈ నెల 23వ వరకు రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. దేశం ధనస్సు రాశిలో ఉన్నందున గురుడు, కుజుడు, కేతువు వంటి గ్రహాల కలయిక, గురుడి శక్తిని క్షీణించేందుకు పాప గ్రహాల శక్తి పుంజుకుందని తెలిపారు. కరోనా మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో స్వాత్మానందేంద్ర ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ గణపతి పూజతో దీన్ని ప్రారంభించారు. ధన్వంతరి, మన్యుసూక్త తదితర హోమాలు 11 రోజల పాటు కొనసాగనున్నాయి.  

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అమృత పాశుపత సహిత, విషజ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామని స్వాత్మానందేంద్ర తెలిపారు. సామాజిక స్పృహతో వీటిని నిర్వహిస్తున్నామని చెప్పారు. శని, కుజుల కలయిక వల్ల దేశ, విదేశాల మీదప్రభావం ఉందన్నారు. ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉందని చెప్పారు. అందుకే విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాగంలో 11 మంది వేద పండితులు, జపాలు చేసేందుకు మరో 15 మంది పాల్గొంటున్నారని చెప్పారు. అయితే ప్రపంచంలోని 167 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయని.. హేతువాదులు మరో వాదనకు తెరతీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh