Most Corona positive case in Maharashtra మహరాష్ట్రలో కరోనా కల్లోలం.. 42 పాజిటివ్ కేసులు

Covid 19 cases rise to 147 122 indians 25 foreign nationals test positive

coronavirus in india, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus pakistan, coronavirus in world, coronavirus in odisha, coronavirus in india latest news, coronavirus count in india, number of coronavirus cases in india, coronavirus in india pune, coronavirus in west bengal, coronavirus vaccine, coronavirus symptoms, coronavirus medicine, coronavirus drugs, coronavirus treatment, coronavirus prevention, masks, hand sanitizers

The total number of confirmed COVID-19 cases in India has risen to 147 – comprising 122 Indian nationals and 25 foreign nationals, Ministry of Health and Family Welfare website stated. Earlier, Minister of External Affairs S Jaishankar informed that an Air Asia flight would bring back Indian students and other passengers that were waiting in transit at the Kuala Lumpur airport in Malaysia

మహరాష్ట్రలో కరోనా కల్లోలం.. 42 పాజిటివ్ కేసులు

Posted: 03/18/2020 10:03 AM IST
Covid 19 cases rise to 147 122 indians 25 foreign nationals test positive

ప్రపంచవ్యాప్తంగా మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి ఇటు మన దేశంలోనూ చాపకింత నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా 142 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ అందోళన రెకెత్తిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ ప్రభావం మొదటి దశ దాటి రెండో దశకు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేయడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. దేశం మొత్తం మీద కరోనా వైరస్ వల్ల ముగ్గురు చనిపోయారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆంక్షలను మరింత కఠినం చేసే ఆలోచనలో ఉన్నట్టు ఉద్దవ్ థాక్రే మోదీతో చెప్పినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ముంబైలో మాల్స్, థియేటర్స్‌, యూనివర్సిటీలను మూసివేశారు. పబ్లిక్ ఫంక్షన్స్, ఈవెంట్స్, అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం రవాణా వ్యవస్థపై కూడా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు అనవసర ప్రయాణాలను తగ్గించుకోకపోతే.. రైళ్లు,బస్సులను కూడా నిలిపివేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

కొత్తగా పశ్చిమబెంగాల్‌లో తొలికేసు నమోదయింది. దీంతో కరోనా మహమ్మారి మన దేశంలో 16 రాష్ట్రాలకు పాకినట్లయింది. మహారాష్ట్రలోనే 41 మందికి ఈ వైరస్ సోకగా తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో ఒకరికి సోకింది. కరోనా విజృంభిస్తుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఏప్రిల్‌ 2వ తేదీ వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా థియేటర్లు, మాల్స్‌, జిమ్‌ సెంటర్లు కూడా మూసేశాయి. ఈ నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా పాఠశాలలు, యూనివర్సిటీలతో సహా థియేటర్లు, వ్యాయామశాలలు మూసివేయాలని సూచించగా... తాజాగా అన్ని చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు, కేంద్ర మ్యూజియాలను కూడా ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  maharashtra  kerala  corona postive cases  quarantine  foreigners  Imdia  

Other Articles