Guidelines for Telangana crop loan waiver released రైతులకు గుడ్ న్యూస్: పంట రుణమాఫీకి గైడ్ లైన్స్ విడుదల

Telangana crop loan waiver to be implemented with family as unit

crop loan, loan waiver, family unit, guidelines to loan waiver, telangana farmers, election promise, budget presentation, CM KCR, Telangana, Politics

In a major relief to farmers, the State government on Tuesday issued guidelines for Crop Loan Waiver-2018 scheme which will be applicable for all crop loans sanctioned or renewed on or after April 1, 2014 and outstanding as on December 11, 2018.

రైతులకు గుడ్ న్యూస్: పంట రుణమాఫీకి గైడ్ లైన్స్ విడుదల

Posted: 03/17/2020 09:24 PM IST
Telangana crop loan waiver to be implemented with family as unit

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీని ఎట్టకేలకు ఏడాది పూర్తైన తరువాత తీర్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వ్యవసాయ రుణాల మాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఈమేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2018 డిసెంబర్‌ 11లోపు తీసుకున్న పంటరుణాలకు మాఫీ వర్తిస్తుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేయనున్నారు.

పట్టణ ప్రాంతాల్లోని బ్యాంకుల నుంచి పంట కోసం తీసుకున్న బంగారం రుణాలకు మాఫీ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ.25వేల లోపు ఉన్న రుణాలను ఒకే దఫాలో.. రూ.లక్ష వరకు ఉంటే నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని పేర్కొంది. ఆ మేరకు రైతులకు మాఫీ మొత్తాన్ని చెక్కుల ద్వారా అధికారులు అందించనున్నారు. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితా రూపొందించి మండల స్థాయిలో బ్యాంకర్ల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి జాబితా ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles