Telugu MBBS Students on way to Hyd stuck in Malaysia స్వదేశానికి కౌలాలంపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

300 telugu mbbs students stuck in malaysia kuala lumpur airport on way to hyd

coronavirus in india, coronavirus, covid-19, Indian students Malaysia,Indian students, Telugu MBBS students, kaula lampur, malyasia, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

More than 200 Telugu students who are studying MBBS in the Philippines are stuck in Kuala Lumpur airport in Malaysia on the way to India. The decision by the Director General of Civil Aviation (DGCA) restricting the travel of passengers from Philippines and Malaysia affected the students.

స్వదేశానికి కౌలాలంపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

Posted: 03/18/2020 10:59 AM IST
300 telugu mbbs students stuck in malaysia kuala lumpur airport on way to hyd

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్ లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు అందేవరకు తమ విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నామని పేర్కోన్నారు.  దీంతో వందలాది మంది తెలుగు విద్యార్థులు మంగళవారం ఉదయం ఫిలిప్పీన్స్ లోని మనీలా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి కౌలాలంపూర్‌ చేరుకున్నారు. కానీ అక్కడే వారిని అధికారులు నిలిపివేశారు. వెనక్కు వెళ్లిపోవాలని విమానాశ్రయం అధికారులు పేర్కోనడంతో వారు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.

ఓ వైపు తిరిగి వెనక్కి వెళ్లాలన్నా పిలిప్పీన్స్ అధికారులు మాత్రం నో ఎంట్రీ అంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. విమానాశ్రయం అధికారులు తమ నుంచి పాస్ పోర్టులు తీసుకున్నారని.. బోర్డింగ్‌ పాస్‌ లను ఇస్తామని తెలిపినా ఇప్పుడు ఎంబసీ పర్మిషన్ లేకుండా వెళ్లేందుకు వీలు లేదంటున్నారని అక్కడున్నవారు వాపోతున్నారు. ఇప్పటికే కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో వందలమంది చిక్కుకుపోయారు. వారికి తోడు ఇప్పుడు అదనంగా పిలిప్పీన్స్ నుంచి మరో విమానం కౌలాలంపూర్‌ చేరుకోబోతోంది. అందులోనూ ఎక్కువమంది భారతీయులే.

అక్కడున్న భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుమారు 3 వందల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల వారు, తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాల విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయిన వారిలో వున్నారు. భారత్‌ వచ్చే విమానాలన్నీ రద్దవ్వడంతో వారంతా విమానాశ్రయంలో రోజంతా పడిగాపులు కాశారు. దీంతో ఇక్కడ చిక్కుకుపోయిన విద్యార్థుల పరిస్థితపై తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా కథనాలు ప్రసారం చేసింది.

అక్కడ విద్యార్థుల ఆవేదనను కళ్లకు కట్టినట్లు చూపించింది. దీంతో భారత ఎంబసీ అధికారులు స్పందించారు. కౌలాలంపూర్‌లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌ ఏషియా విమానాలను భారత్‌కు అనుమతిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ప్రకటనతో ఊరట లభించినట్లయింది. అయితే.. భారత ఎంబసీ అనుమతి లేకుండా విమానం ఎక్కేందుకు వీల్లేదని ఎయిర్‌‌పోర్ట్ అధికారులు విద్యార్థులను అడ్డుకుని ఆపేయడంతో వారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles