Coronavirus: locals gor poultry Hens freely కరోనా భయం: చికెన్ కొనేవారు కానరాక.. ఉచితంగా కోళ్లు..

Covid 19 hits chicken sales free hens distributed to locals

poultry hens free, free poultry hens, chicken sales, chicken poultury, poultry farms, coronavirus scare, covid-19 scare, coronavirus, COVID-19, poultry industry, andhra pradesh

People are swearing off chicken, worried that they might contract the dreaded coronavirus (COVID-19), leading to a sharp decline in sales of chicken. at poultry markets. Amid Animal Husbandry assurances people are not purchasing chicken. poultry farms are letting locals to take hens at free of cost.

కరోనా భయం: చికెన్ కొనేవారు కానరాక.. ఉచితంగా కోళ్లు..

Posted: 03/13/2020 12:33 PM IST
Covid 19 hits chicken sales free hens distributed to locals

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి భారిన పడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐదువేల మందికి పైగా బాధితులు అసువులు బాసారు. లక్షకుపైగా ప్రజలు ఈ వ్యాధి కబంధహస్తాలలో చిక్కుకున్నారు. మనుషులతో పాటు ఈ వైరస్ అటు పౌల్ట్రీ ఇండస్ట్రీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ప్రభావంతో పల్లెలతో పాటు పట్టణాలు, నగరాల్లోనూ చికెన్ కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయి. ఎంతలా అంటే రీటైల్ వ్యాపారం మాట అటుంచితే..   హోల్ సేల్ వ్యాపారస్థులకు కూడా పూర్తిగా నష్టాలపాలు చేస్తోంది.

పలు దఫాలుగా ఇలాంటి వైరస్ లో తమ అమ్మకాలను అణిచివేస్తున్నా.. వేగంగా పుంజుకుని నిలదోక్కుకుంటున్న తరుణంలో మరోమారు ఈ రంగం వ్యాపారులను కుబేరులను నుంచి కుచేలుడిని చేస్తోంది కరోనా వైరస్. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి ఫౌల్ట్రీ రంగం దెబ్బతినింది. ఫలితంగా చికెన్ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. తీవ్ర నష్టాలను భరించైనా దాణా ఖర్చులైనా రాబట్టుకుందామని యోచిస్తున్న ఫౌల్ట్రీ ఫామ్ లకు ఆ ఖర్చులు కద కదా.. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ పరిధిలో ఓ దుకాణ యజమాని కిలో కోడి మాంసాన్ని రూ.40కే విక్రయిస్తానంటూ బోర్డు పెట్టారు.

ఈయనను చూసిన చాలా మంది తాము అదే ధరకు చికెన్ విక్రయిస్తామని బోర్డులు పెట్టినా.. ఇది చర్చించుకునేందుకు ఓ వార్తగా మారుతుందే తప్ప.. నిజానికి విక్రయాలు మాత్రం జరగడం లేదు. ఇక చికెన్ దుకాణా వ్యాపారుల పరిస్థితే ఇలా వుంటే.. ఇక ఫౌల్ట్రీ ఫామ్స్ పెట్టిన వారి కష్టాలు చెప్పనలవికాదు. వారు తీవ్రనష్టాలను పంటి బిగువన భరిస్తున్నారు. తమ ఫామ్ నుంచి కోళ్లను వ్యాపారులకు చేరవేసేందుకు అయ్యే ఖర్చులు కూడా గిట్టబాటు కాకపోవడంతో.. ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల ఫౌల్ట్రీ ఫామ్ యజమానులు స్థానికులకు కోళ్లను ఉచితంగా ఇచ్చేస్తున్నారు.  

చికెన్ వల్ల వైరస్ వ్యాపించదని అటు ప్రభుత్వాలు, ఇటు వ్యాపారులు ప్రకటనలు ఇస్తున్నా ప్రజల్లో మాత్రం నమ్మకం కలగడం లేదు. చికెన్, గుడ్ల వాడకాన్ని పూర్తిగా తగ్గించేశారు. ఫలితంగా చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి. ఏపీలో అయితే కిలో చికెన్ రూ. 20-రూ.40 మధ్య విక్రయిస్తున్నారు. అయినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పౌల్ట్రీ వ్యాపారి గువ్వల కుమార్‌రెడ్డి తన ఫాంలోని 2 వేల కోళ్లను సమీప గ్రామాల ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles