Telangana govt to increase electricity charges, taxes విద్యుత్ చార్జీలు.. ఇంటి పన్నులు పెంచుతాం: సీఎం

Telangana govt to increase electricity charges taxes

CM KCR Speech in Assembly, KCR Speech on Village Development in Assembly, KCR Speech on palle Pragati in Assembly, CM KCR on Electicity Charges, CM KCR on House Taxes, CM KCR, palle Pragati, Village Development, Assembly, Electricity charges, House Taxes, village Revenue, Telangana, Politics

Telangana CM KCR Speech in Assembly on Village Development that is palle Pragati said that his government is going to hike the Electricity Charges and house Taxes as apart to give boost to village revenues.

విద్యుత్ చార్జీలు.. ఇంటి పన్నులు పెంచుతాం.. దామరికం లేదన్న సీఎం

Posted: 03/13/2020 03:33 PM IST
Telangana govt to increase electricity charges taxes

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయా అంటే అవునని చెప్పకతప్పదు. గత ఐదేళ్లుగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం ఈ సారి ధరలను మాత్రం పెంచకతప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇప్పటికే ఆర్టీసీని నష్టాలబారిలో పడకుండా ఆదుకున్న ప్రజానికం.. అదే విధంగా నాణ్యమైన విద్యుత్ కోరుకుంటున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగా కొంత భారాన్ని మోయకతప్పదన్నారు. కచ్చితంగా ధరలను పెంచక తప్పదని.. ఇందులో దాపరికం ఏమీలేదని కూడా ఆయన చెప్పారు. ఈ విషయంలో కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాల్లో నిజముందని ప్రకటించేశారు.

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచుతామని స్వయంగా సీఎం కేసీఆర్ తెలిపారు. దళితులకు, గిరిజనులకు విద్యుత్ చార్జీల పెంపునుంచి మినహాయింపు ఇస్తామని ఆయన తెలిపారు. వారికి 101 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఎవరికైతే పేయింగ్ కెపాసిటీ ఉంటుందో వారికి మాత్రమే పెంచుతామని తెలిపారు. పెంచకపోతే వ్యవస్థ నడవదని తెలిపారు. జీతం పెరగాలి, క్వాలిటీ పెరగాలి, 24గంటల పాటు విద్యుత్ ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా విద్యుత్ చార్జీలు పెంచుతామని తెలిపారు. మంచి ప్రజా ప్రతినిధులు, మంచి పాలకులు ఉంటే వాస్తవాలను ప్రజలకు తెలపాలి అని అన్నారు.

ఇక దీంతో పాటు గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు కూడా అర్థికంగా నిలదొక్కకునేలా చేసేందుకు ఇంటి పన్నులను కూడా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. పెంచిన పన్నులతో వచ్చే ప్రతీ రూపాయిని ప్రజల కోసమే ఖర్చుచేస్తామని చెప్పారు. పంచాయితీలు, పురపాలక సంఘాలు ఆర్థకపుష్టిగా వుండాలంటే ప్రజలు కొంత భారాన్ని భరించాల్సిందేనన్నారు. అయితే గతంలో లంచాలు ఇచ్చి రాయించుకునే పద్దతికి తాము స్వస్తి పలికామని చెప్పిన ఆయన ప్రజలు తమంతట తాము సెల్ప్ డిక్లరేషన్తో ఇల్లు ఎంత స్ధలాన్ని ఆక్రమించి ఉందో అందుకు అనుగుణంగా ఇంటి పన్నును చెల్లించాలని తెలిపారు. ఎవరైనా అవాస్తవం చెప్పినట్లయితే వారికి 25 టైమ్స్ జరిమానా విధిస్తామని తెలిపారు. దాంతొ పాటు 2ఏండ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు.

60, 70 ఏళ్లగా పలు పంచాయితీల్లో పన్నులు ఎవరికి ఎవరు కట్టడం లేదని గ్రామాలన్నీ పెంటకుప్పలయిపోయాయని తెలిపారు. కోట్లలో అవినీతి జరుగుతుందన్నారు. పనులు జరగడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసి పాలకులను తిడుతున్నారన్నారు. ఎందుకు ప్రజాప్రతినిధులు నిందలకు గురి కావాలని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్దికే పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. 500 జనాభా ఉన్న పంచాయతీలకు ఐదేళ్లలో రూ.40 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీలకు కూడా నిధులు కేటాయించామన్నారు. ఇక గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు అన్ని పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇది కాకుండా ఖాళీలను భర్తీ చేసుకునే వెసలుబాటును కలెక్టర్లకు అప్పగించామన్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  palle Pragati  Village Development  Assembly  Electricity charges  House Taxes  Telangana  Politics  

Other Articles